వేసవిలో ఈ ఫుడ్స్ జోలికి వెళ్లకండి వేసవిలో అల్లం ఎక్కువగా వాడితే శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇంగువ జీవక్రియకు మేలు చేస్తుంది. బ్లడ్ ఇన్ఫ్లమేషన్ తో బాధపడేవారు వేసవిలో ఇంగువ తినకూడదు. మిరపకాయలు భారతీయ వంటకాలలో అంతర్భాగం. వేసవి మిరపకాయలు తక్కువగా వాడటం మంచిది. గుండె మంట, చికాకు, ప్రేగు సంబంధిత సమస్యలను పెంచుతుంది. క్యాప్సికమ్ కూడా తక్కువగా వాడాలి. లవంగం కూడా వేసవిలో తక్కువగా వాడాలి. లవంగం శరీరంలో మంటను కలిగిస్తుంది. వెల్లుల్లి కూడా వేడిని కలిగిస్తుంది. రుచి బాగున్నప్పటికీ మనస్సును కూడా ప్రభావితం చేస్తుంది. వెల్లుల్లిని అధికంగా తీసుకుంటే శరీరానికి వేడి చేస్తుంది. వేసవిలో వెల్లుల్లిని భోజనంలో చేర్చుకోకపోవడమే మంచిది.