ఎండలో వేడెక్కిన నీటిని తాగొచ్చా? ఆయుర్వేదంలో ఏం చెప్పారు? రోజూ గోరువెచ్చని నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. కొందరు సూర్యరశ్మిలో వేడెక్కిన నీటిని తాగుతారు. చిత్రంగా ఉందా? దీనివల్ల లాభాలున్నాయ్. ఆయుర్వేదంలో దీన్ని ‘సన్ ఛార్జ్డ్ వాటర్’ అంటారు. దీన్ని వల్ల అనేక లాభాలున్నాయట. సూర్యరశ్మిలో వేడెక్కిన నీరు తాగడం వల్ల ఎన్నో రోగాలు నయమవుతాయట. గాజు సీసా(ప్లాస్టిక్ వద్దు)లో నీరు వేసి 3 రోజులపాటు 8 గంటల సేపు ఎండలో ఉంచాలి. ఆ నీటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. సన్-ఛార్జ్డ్ వాటర్‌లో యాంటీ-వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయట. ఈ నీటిని తాగడం వల్ల గుండెల్లో మంట, అల్సర్ వంటి జీర్ణ సమస్యలు నయమవుతాయట. ఈ నీటిలో విటమిన్-డి కూడా ఉంటుందట. ఎముకుల ఆరోగ్యానికి కూడా మంచిదట. గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసమే. డాక్టర్ సూచనలు తీసుకోండి. Images Credit: Pexels and Pixabay