తక్కువ నూనెతో వంటలు ఇలా చేయండి. మీరు ఆహారాన్ని నూనెలో వేయించడం కంటే పెనం మీద కాల్చడం బెటర్. నూనెలో వేయించిన వంటకాలను కాగితం మీద వేస్తే నూనెను పీల్చుకుంటుంది. మీరు ఆహారాన్ని వేడిచేసేటప్పుడు అందులో అదనపు నూనెను తీసివేయండి. స్టీమింగ్ ఫుడ్స్ కు ఎలాంటి నూనె వాడకూడదు. నూనె వాడకుండా కూరగాయలను నీటిలో ఉడకబెడితే ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి. నూనెలో డీప్ ఫ్రై కంటే గ్రిల్ చేయడం బెటర్. సాధ్యమైనంత వరకు నాన్ స్టిక్ ప్యాన్ లను వాడకపోవడమే మంచిది. వాడితే మంచి క్వాలిటీవి ఎంచుకోవాలి.