చాక్లెట్స్ ఎక్కువగా తినొద్దని చెప్తుంటారు చాలామంది. కానీ, డార్క్ చాక్లెట్ వల్ల హెల్త బెనిఫిట్స్ ఉన్నాయట. రోజు డార్క్ చాక్లెట్ తింటే.. బీపీ కంట్రోల్ లో ఉంటుంది. రక్త నాళాలు ఫ్రీ అవుతాయి. డార్క్ చాక్లెట్ తింటే.. బ్రెయిన్ ఫంక్షన్ మెరుగై, మెమోరి పెరుగుతుంది. డార్క్ చాక్లెట్‌లో ఉండే.. కోకో మెటబాలిజమ్‌ను మెరుగుపరుస్తుంది. టైప్ - 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. బరువు తగ్తేందుకు, జీర్ణ క్రియకు ఉపయోగపడుతుంది. గట్ బ్యాక్టీరియా పెంచేందుకు కూడా చాక్లెట్ మంచిది. సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది డార్క్ చాక్లెట్. దాని వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. డార్క్ చాక్లెట్ లో ఐరన్, కాపర్, మెగ్నీషియం, మాంగనీస్ లాంటివి ఉంటాయి. దీంతో.. చర్మం క్లియర్ గా కనిపిస్తుంది. మెరుస్తుంది. డార్క్ చాక్లెట్ లో ఓలిక్ యాసిడ్ ఉంటుంది. అది బ్యాడ్ కొలస్ట్రాల్ ని తగ్గించి, గుడ్ కొలస్ట్రాల్ పెంచుతుంది. డార్క్ చాక్లెట్ లో కోకో కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దాంట్లో ఫైబర్, పొటాషియం, కాల్షియం, కాపర్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. గమనిక.. డాక్టర్ సూచనలు, సలహాలు కూడా తీసుకుని పాటిస్తే మంచిది.