సమ్మర్లో డీహైడ్రేషన్ - ఇలా చేస్తేనే సేఫ్ ఎండలు మండుతున్నాయి. సమ్మర్ లో హీట్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. వేసవిలో హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం.కొబ్బరినీళ్లు, హెర్బల్ టీలు, హైడ్రెటింగ్ పానీయాలు తాగాలి. ఎండాకాలంలో కాటన్ దుస్తువులను ధరించడం మంచిది. లేతరంగు దుస్తులు ఎంచుకోండి. టోపీ, సన్ గ్లాసెస్ ధరిస్తే యూవీ కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది. సాధ్యమైనంత వరకు నీడలో ఉండే ప్రయత్నం చేయండి. ఎండలేని సమయంలోనే బయటకు వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. వేసవిలో తేలికపాటి భోజనం తీసుకోవాలి. సులభంగా జీర్ణం అవుతాయి. పుచ్చకాయ, దోసకాయ, సిట్రస్ పండ్లు తినాలి. పోర్టబుల్ ఫ్యాన్స్, మిస్టింగ్ ఫ్యాన్స్, ఐస్ గిన్నె, కోల్డ్ కంప్రెస్ ఇవన్నీ చల్లగా ఉంచుతాయి. విపరీతమైన వేడిగాలులు ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిది. వీలైనంత వరకు సాయంత్రం లేదా ఉదయం వ్యాయామాలు చేయండి. ఇలా చేస్తే మీ శరీరం తొందరగా అలసిపోదు. సాధ్యమైనంత వరకు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచే ప్రయత్నం చేయాలి. తగినంత నీరు తాగడం ముఖ్యం.