ఎండలు హడలు పుట్టిస్తున్నాయి. వేడి గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సమ్మర్ లో కూల్ గా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా లస్సీ చాలా అవసరం. లస్సీ చాలామంది ఫేవరెట్ డ్రింక్. ఎండలను తట్టుకునేందుగా కచ్చితంగా దీన్ని తాగుతారు. లస్సీలో ఉండే లాక్టిక్ యాసిడ్స్ వల్ల స్కిన్ మెరుస్తుంది. స్కిన్ హెల్దీగా ఉంటుంది. లస్సీలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. రోజు తాగడం వల్ల ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. లస్సీ పెరుగుతో తయారు చేస్తారు కాబట్టి.. ఆహారాన్ని తొందరగా జీర్ణం చేస్తుంది. ఎసిడిటీని కూడా తగ్గిస్తుంది. పెరుగుతో చేయడం వల్ల దాంట్లో ఉన్న పోషకాలు అందుతాయి. లస్సీ రోజు తాగితే బీపీ కంట్రోల్ లో ఉంటుంది. కానీ, డయాబెటిస్ రోగులు తాగొద్దు. లస్సీలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల బోన్స్ గట్టిపడతాయి. లస్సీలో విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్, కాల్షియం, న్యూట్రిన్స్ ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి మంచి చేస్తాయి.