ఎండలు ఎక్కువ అయిపోతున్నాయి. అందుకే, తిండి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. టొమాటో, దోశకాయ కలిపి తీసుకోకూడదు. అవి ఒకదానికొకటి సెట్ అవ్వదు. మీల్స్ తో ఫ్రూట్స్ కలిపి తినొద్దు. ఆహారం జీర్ణం అయ్యేవరకు ఫ్రూట్స్ డైజెస్ట్ అవ్వవు. ఫర్మెంట్ అయిపోతుంది. పాలు, చేప కలిపి తీసుకుంటే.. బ్లడ్ సర్క్యులేషన్ లో ఇబ్బందులు వస్తాయి. పాలు చలవ, చేప వేడి కాబట్టి ఇబ్బందులు తలెత్తుతాయి. రెండు ప్రొటీన్ హెవీ ఫుడ్స్ ని కలిపి తీసుకోకూడదు. ప్రొటీన్ ఎక్కువ అయితే.. ఇబ్బందులు ఏర్పడతాయి. పాలు, తులసిని కలిపి తాగొద్దు. ఆయుర్వేదం ప్రకారం.. రెండింటి మధ్య 30 నిమిషాల గ్యాప్ ఉండాలి. మిల్క్ అండ్ అరటికాయ, సోర్ ఫ్రూట్స్ కలిపి తీసుకోకూడదు. అందుకే, బనానా మిల్క్ షేక్ తీసుకోకూడదు అని చెప్తారు. చీజ్, కూల్ డ్రింక్స్ కాంబినేషన్ పొట్టను పాడుచేస్తుంది. రెండు కలిపి తీసుకుంటే.. డైజషన్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. బంగాళదుంపను ప్రొటీన్ ఫుడ్ తో కలిపి తీసుకోకూడదు. గమనిక: ఇవి కేవలం సూచనలు మాత్రమే.. పాటించేముందు డాక్టర్స్ ని సంప్రదించాలి.