గ్లాకోమా అనేది పూర్తిగా చూపు పోగోట్టే పరిస్థితి. ఇది తెలియకుండా క్రమంగా అంధత్వానికి దారి తీసే ప్రమాదకర వ్యాధి.

అకస్మాత్తుగా లేదా క్రమంగా చూపు మసకబారుతుంది.

ముఖ్యంగా పెరీఫెరల్ దృష్టి మసకబారడం అనేది అన్నింటికంటే ముందు కనిపించే లక్షణం. దీన్ని అసలు నిర్లక్ష్యం చెయ్యకూడదు.

రాత్రి పూట లైట్ చుట్టూ వలయాలు కనిపించడం కూడా గ్లకోమా లక్షణమే. ఇలా అనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం అవసరం.

కళ్లు, తల నొప్పి దీర్ఘకాలం కొనసాగడం, అసౌకర్యంగా ఉండడం, వికారంగా ఉండడం కొన్ని సార్లు వాంతులు కూడా ఉండవచ్చు.

కంటి రంగులో మార్పు కనిపిస్తుంది. కంటిలోని నలుపు భాగంలోని రంగులో తేడా కనిపిస్తే అశ్రద్ధ చెయ్యొద్దు.

క్రమంగా చూపు వైశాల్యం తగ్గిపోతుంది. గొట్టం నుంచి చూసినట్టగా ఉంటుంది. ఈ లక్షణం గ్లకోమా బాగా ముదిరిపోయినపుడు కనిపిస్తుంది.

Image Source: Pexels

గ్లకోమాకు చికిత్స లేదు. దీనిని అదుపు చెయ్యడం మాత్రమే సాధ్యపడుతుంది. కనుక లక్షణాలను త్వరగా గుర్తించడం అవసరం.

Image Source: pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.