అతి ఎప్పుడూ పనికి రాదని అంటుంటారు. అరటి పండ్లు అతిగా తిన్నా అంతేనట. అరటి పండ్లలో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు ఎక్కువ. అరటిపండ్లు ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. వీటిలోని చక్కెరల వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు పెరగవచ్చు. మధుమేహులకు ప్రమాద కరం. అరటిలో ఫైబర్ ఎక్కువ. మోతాదులో తింటే మంచిదే. అతిగా తింటే జీర్ణసమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అరటి పండ్లు ఎక్కువ తింటే రక్తంలో పొటాషియం ఎక్కువగా ఉండే హైపర్కలెమియా అనే పరిస్థితి ఏర్పడుతుంది. హైపర్ కల్కేమియాలో కండరాలు బలహీనత, నీరసం, గుండె లయ తప్పటం వంటి లక్షణాలు ఉంటాయి. అరటి పండ్లు ఎక్కువగా తింటే వీటిలోని చక్కెర వల్ల నోటి శుభ్రత పాటించకపోతే దంతక్షయం కావచ్చు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే.