నెయ్యిలో వేయించిన ఈ ఫుడ్స్ తింటే ఏమవుతుందో తెలుసా? నెయ్యిలో వేయించిన డ్రైఫ్రూట్స్, నట్స్ తింటే అందులోని పోషకాలు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ఈ స్నాక్స్ ను మీ డైట్లో చేర్చుకుంటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. నెయ్యిలో కొవ్వులు పుష్కలగా ఉన్నాయి. అధిక మొత్తంలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. నెయ్యి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి శక్తిని పెంచుతాయి. శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. నెయ్యిలో వేయించిన డ్రైఫ్రూట్స్ తింటే జీర్ణక్రియ పెరుగుతుంది. ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి తింటే సులభంగా జీర్ణం అవుతాయి. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, డ్రైఫ్రూట్స్ లోని సహాజచక్కెరలు, ప్రొటీన్ల కలయికతో త్వరగా శక్తిని అందిస్తుంది. ఇది ఏకాగ్రతను పెంచడంతోపాటు ఆరోగ్యకరమైన స్నాక్స్ గా పనిచేస్తుంది. నెయ్యిలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బాదం, వాల్నట్ వంటి డ్రైఫ్రూట్స్ తో కలిపి తింటే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నెయ్యిలో ఎక్కువ కేలరీలు ఉన్నప్పటికీ నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ మితంగా తింటే బరువు తగ్గవచ్చు.