Image Source: pexels

వేసవిలో హైడ్రేట్ గా ఉంచే ఫుడ్స్ ఇవే.

వేసవిలో అధిక నీటి కంటెంట్ ఉన్న పండ్లు, కూరగాయలు తింటే సహజ హైడ్రేషన్ అందిస్తాయి.

నీరు అధికంగా ఉన్న ఫుడ్స్ తింటే ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. జీర్ణక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.

పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. ఇందులో కేలరీలు కూడా చాలా తక్కువ. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

బొప్పాయిలో 88 శాతం నీరు ఉంటుంది. ఇందులో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.

దోసకాయలు వేసవిలో ఎంతో మేలు చేస్తాయి. ఇందులో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

టమోటాలో 94 శాతం నీరు ఉంటుంది. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

Image Source: pexels

సోరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కూడా ఉంటుంది. వేసవిలో సోరకాయ తింటే పొట్ట చల్లగా ఉంటుంది.