Teja Sajja: సూపర్ యోధగా నయా సూపర్ హీరో తేజ సజ్జా - 18న రివీల్ చేసే టైటిల్ అదేనా?
సూపర్ హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కలయికలో సూపర్ యోధ నేపథ్యంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న సినిమా టైటిల్ ఈ నెల 18న అనౌన్స్ చేయనున్నారు.
వాట్ నెక్స్ట్? 'హను-మాన్' తర్వాత సూపర్ హీరో తేజ సజ్జా ఏం చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలకు మరి కొన్ని గంటల్లో సమాధానాలు లభించనున్నాయి. ఈ నెల 18న ఆయన కొత్త సినిమా టైటిల్ వెల్లడించనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
తేజ సజ్జా కొత్త సినిమా అనౌన్స్ చేశారోచ్!
ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో 'హను-మాన్' సినిమా హిస్టారికల్ సక్సెస్ సాధించి సూపర్ హీరో సినిమాల్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఆ మూవీ తర్వాత యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనితో కలిసి సినిమా చేయనున్న విషయం ప్రేక్షకులకూ తెలుసు. తెలుగు చిత్రసీమలో అతి తక్కువ కాలంలో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ నంబర్ 36గా టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని ఇవాళ అనౌన్స్ చేశారు.
టైటిల్ కోసం ఏప్రిల్ 18 వరకు వెయిట్ చేయాలి!
తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని సినిమా అనౌన్స్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ, ఈ సినిమా టైటిల్ ఏమిటనేది ఏప్రిల్ 18న వెల్లడిస్తామని తెలియజేసింది. అయితే ప్రీ లుక్ పోస్టర్ బ్యాక్ పోజులో సూపర్ హీరో తేజ సజ్జా హుందాగా ఉన్నారు. హెయిర్ పెంచిన విషయం తెలుస్తోంది. ఈ స్టైలిష్ లుక్ బావుందని ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. 'హనుమాన్'లో సాంప్రదాయ దుస్తులలో కనిపించిన తేజ... కొత్త సినిమాలో సూపర్ యోధగా స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. దీని కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ కానున్నారు.
మిరాయ్... టైటిల్ అదేనా?
Teja Sajja new movie titled Mirai: ఈ చిత్రానికి 'మిరాయ్' టైటిల్ ఖరారు చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఏప్రిల్ 18న టైటిల్ వెల్లడించడంతో పాటు 100 సెకన్ల నిడివి గల గ్లింప్స్ కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ ప్రచార చిత్రానికి 'హనుమాన్' ఫేమ్ హరి గౌర సంగీతం అందించారని తెలిసింది. ఈ సినిమాలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్, 'అశోక వనంలో అర్జున కళ్యాణం' & 'హాయ్ నాన్న' సినిమాల ఫేమ్ రితికా నాయక్ నటించనున్నారు. అయితే, ఆ ఇద్దరి పేర్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Also Read: ఆ ఒక్కటీ అడక్కు రిలీజ్ డేట్ ఫిక్స్ - నరేష్ కొత్త సినిమా థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?
'ఈగల్' తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు ఆయన సేమ్ ప్రొడక్షన్ హౌస్ లో చేస్తున్నారు. ఈ సినిమాలోనూ హై టెక్నికల్ స్టాండర్డ్స్ ఉంటాయని తెలిసింది. తేజ సజ్జ కోసం లార్జర్ దేన్ లైఫ్ స్టోరీని కార్తీక్ ఘట్టమనేని రెడీ చేశారని సమాచారం.
సూపర్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాకు దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని, నిర్మాణం: టీజీ విశ్వప్రసాద్, నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, క్రియేటివ్ నిర్మాత: కృతి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుజిత్ కుమార్ కొల్లి, కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల, రచయిత: మణిబాబు కరణం.