Rahul Sipligunj Engagement: సడన్‌గా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్మెంట్ - అమ్మాయి ఎవరో తెలుసా?
Rahul Sipligunj Engagement: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఆదివారం హరిణి రెడ్డి అనే అమ్మాయితో ఆయనకు ఎంగేజ్మెంట్ జరిగింది.

Rahul Sipligunj Engagement With Harini Reddy: ప్రముఖ సింగర్, బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హరిణి రెడ్డి అనే అమ్మాయితో ఆయనకు నిశ్చితార్థం జరిగింది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సడెన్‌గా రాహుల్ ఎంగేజ్మెంట్ చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
ఎంగేజ్మెంట్ సందర్భంగా కలర్ ఫుల్ డ్రెస్సుల్లో రాహుల్ హరిణి రెడ్డి మెరిసిపోయారు. నిశ్చితార్థం వేడుక ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వధువు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమెను ప్రేమ వివాహం చేసుకోబోతున్నారా? లేదా పెద్దలు కుదిర్చిన సంబంధమా? అనేది తెలియాల్సి ఉంది. నిశ్చితార్థం ఫోటోలను రాహుల్ కానీ, కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా రిలీజ్ చేయలేదు. ఏ చిన్న విషయాన్నైనా అభిమానులతో పంచుకునే రాహుల్ ఇంత పెద్ద విషయాన్ని గోప్యంగా ఉంచడంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఆ అమ్మాయి ఎవరు అనే దానిపై సెర్చ్ చేస్తున్నారు. దీంతో పాటే ఆయన పెళ్లిపై అధికారిక ప్రకటన కోసం కూడా ఎదురుచూస్తున్నారు.

Also Read: డిఫరెంట్ రోల్‌లో సత్యదేవ్ - మహేష్ బాబు నిర్మిస్తున్న 'రావు బహదూర్' టీజర్ చూశారా?
సింగర్‌గా తన వాయిస్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు రాహుల్. ఫేమస్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో విన్నర్‌గా నిలవడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. దర్శక ధీరుడు రాజమౌళి 'RRR'లో ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు'ను రాహుల్ పాడారు. హిట్ మూవీస్‌లో పాటలతో పాటు తెలంగాణ జానపదాలు, ర్యాప్ సాంగ్స్ కూడా పాడి అందరి మనసులు గెలుచుకున్నారు. ఫోక్ సాంగ్స్ పాడడంతో ఆయనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఈ క్రమంలో 2023లో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఆయనకు రూ.10 లక్షల నగదు బహుమతి అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.కోటి నజరానా ఇస్తామని ప్రకటించిన విధంగానే ఇండిపెండెన్స్ డే సందర్భంగా రూ.కోటి చెక్ అందజేశారు.





















