Mokshagna: బాలయ్య వారసుడు వచ్చేస్తున్నాడు - యంగ్ లయన్ మోక్షజ్ఞ న్యూ లుక్ అదిరిపోయింది
Nandamuri Mokshagna: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ న్యూ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే ఆయన ఎంట్రీ ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Nandamuri Mokshagna New Look For Tollywood Debut Movie: నందమూరి నట సింహం బాలకృష్ణ అభిమానులకు నిజంగా ఇది గుడ్ న్యూస్. ఆయన తనయుడు, నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఆయన ఎంట్రీపై వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి.
తాజాగా మరోసారి మోక్షజ్ఞ ఎంట్రీపై మరోసారి చర్చ మొదలైంది. చాలా రోజుల తర్వాత ఇటీవల ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఆయన ట్రెడిషనల్ లుక్‌లో కనిపించారు. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... డెబ్యూ మూవీ కోసమే ఆయన సూపర్ కూల్ లుక్ మెయింటెయిన్ చేస్తున్నారంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తండ్రికి తగ్గ కొడుకులానే యంగ్ లయన్‌లా ఉన్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
View this post on Instagram
Also Read: డిఫరెంట్ రోల్‌లో సత్యదేవ్ - మహేష్ బాబు నిర్మిస్తున్న 'రావు బహదూర్' టీజర్ చూశారా?
గత రెండు మూడేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే ప్రచారం సాగుతోంది. గతంలో ఫస్ట్ మూవీ నుంచి లుక్ ఇదేనంటూ రిలీజ్ చేసినా అది పూజా కార్యక్రమాల వరకూ వెళ్లిన మూవీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. 'హను మాన్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారనే ప్రచారం అప్పట్లో సాగింది. మోక్షజ్ఞ హీరోగా 'ఆదిత్య 999' మూవీని ప్రశాంత్ వర్మ దర్శకత్వం చేయనున్నారనే అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. అయితే, కొన్ని కారణాలతో అది వాయిదా పడింది. దీంతో నందమూరి వారసుడి ఎంట్రీకి బ్రేక్ పడింది.
అవే కారణాలా?
ప్రశాంత్ వర్మ వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడం... మోక్షజ్ఞను లాంచ్ చేయడానికి బాలయ్యను కాస్త టైం అడిగారని తెలుస్తోంది. దీంతో పాటే మోక్షజ్ఞ కూడా డ్యాన్స్, యాక్టింగ్‌తో పాటు ఇతర స్కిల్స్‌పై పూర్తిగా సంసిద్ధం కావడానికి టైం తీసుకున్నట్లు ఇన్ సైడ్ సమాచారం. చాలా రోజుల గ్యాప్ తర్వాత మోక్షజ్ఞ ఇలా ట్రెడిషనల్ లుక్‌లో కనిపించడం మళ్లీ 'ఆదిత్య 999' ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ కోసం స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా సాగుతోందని ఫిలింనగర్ వర్గాల టాక్. ఈ మూవీతో తండ్రికి తగ్గ తనయుడిగా యంగ్ లయన్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ భారీ క్రేజ్ సంపాదించుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.





















