Singer KK Passes Away: చివరి శ్వాస వరకూ పాడుతూనే ఉన్నారు - కేకే హఠాన్మరణంపై సంతాపం తెలిపిన చిరు, పవన్, తమన్ - వాళ్ళు ఏమన్నారంటే?
గాయకుడు కేకే హఠాన్మరణంపై చిరంజీవి, పవన్ కళ్యాణ్, సంగీత దర్శకుడు తమన్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
Tollywood Celebs Mourns Demise Of Singer KK: ప్రముఖ గాయకుడు కేకే అలియాస్ కృష్ణకుమార్ కున్నత్ (Singer KK - Krishnakumar Kunnath) హఠాన్మరణం ఎంతో బాధ కలిగించిందని తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు తెలియజేశారు. కేకే మృతికి సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పించారు. గాయకుడితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Also Read: సింగర్ కేకే మృతిపై అనుమానాలు - అసహజ మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు
''కేకే అకాల మరణం షాక్‌కి గురి చేసింది. నా హృదయం విలవిలలాడుతోంది. కేకే అద్భుతమైన గాయకుడు. మంచి మనిషి. 'ఇంద్ర'లో 'దాయి దాయి దామ్మా...' పాట పాడారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను'' అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Heartbroken at the shocking demise of KK. Gone too soon! A fabulous singer and a great soul.He sang ‘Daayi Daayi Daama’ from ‘Indra’ for me. My heartfelt condolences to his family & near and dear ones. May his soul rest in peace! #RIPKK
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 1, 2022
కేకే అకాల మరణం తనకు ఎంతో బాధ కలిగించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ''నా సినిమాల్లో ఆయన పాడిన పాటలు సంగీత ప్రియులను అమితంగా ఆకట్టుకున్నాయి. 'ఖుషి'లో 'ఏ మేరా జహా' పాట అన్ని వయసుల వారికీ చేరువ కావడానికి కేకే గాత్రం ప్రధాన కారణం. కేకే చివరి శ్వాస వరకూ పాడుతూనే ఉన్నారు. సంగీత కచేరి ముగించుకున్న కొద్ది సేపటికి హఠాన్మరణం చెందడం దిగ్భ్రాంతికరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని పవన్ కళ్యాణ్ ఒక లేఖ విడుదల చేశారు.
Also Read: కోటి రూపాయలు ఆఫర్ చేసినా పెళ్లిలో పాడలేదు - అదీ సింగర్ కేకే కమిట్‌మెంట్
గాయకుడు శ్రీ కె.కె. గారు అకాల మరణం బాధాకరం - JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/3UDlJHqtKe
— JanaSena Party (@JanaSenaParty) June 1, 2022
''అద్భుతమైన గాయకుడు, మంచి మనిషి ఈ రోజు మనతో లేరు. రెస్ట్ ఇన్ పీస్ కేకే సాబ్. జీవితాన్ని ఊహించలేం'' అని సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేశారు.
This is Most Shocking …… Kk ji …. 💔
— thaman S (@MusicThaman) June 1, 2022
An Amazing Talent Amazing Human Not With us today …….. Rest In peace #KK Saab
Unpredictable ………… life !!!! pic.twitter.com/YBthHyDAtU
జీవితంలోని ప్రతి దశలోనూ కేకే పాటలు ఓ భాగం అయ్యాయని, అన్ని భాషల్లో - వయసుల ప్రేక్షకుల్లో అభిమానులు కలిగిన ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు కేకే మృతిపై సంతాపం తెలిపారు.
His songs have been an integral part in every phase of life.
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 1, 2022
A Legend who has fans across generations and languages.
Terrible loss to the World of Music.
You'll be missed 💔.
You'll live in our hearts sir.#RIPKK https://t.co/32lxrA3Hyn
Also Read: పెళ్లి చేసుకోబోతున్న పూర్ణ - ఆమెకు కాబోయే భర్త ఎవరంటే?