Siddhu Jonnalagadda: నిర్మాతకు నాలుగు కోట్లు వెనక్కి... సినిమా ఫ్లాప్ కావడంతో హీరో డేరింగ్ డెసిషన్
Siddhu Jonnalagadda Remuneration: స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. సినిమా ఫ్లాప్ కావడంతో నిర్మాతను నష్టాల నుంచి బయట పడేయడానికి రెమ్యూనరేషన్‌లో సగం వెనక్కి ఇవ్వనున్నారు.

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) తనది మంచి మనసు అని మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నారు. ఆయన ఒక డేరింగ్ డెసిషన్ తీసుకుని అందరి చేత 'ఈ స్టార్ బాయ్ చాలా గుడ్ బాయ్ కూడా' అనిపించుకుంటున్నారు. తన సినిమా ఫ్లాప్ కావడంతో నిర్మాతను నష్టాల నుంచి బయట పడేయడానికి రెమ్యూనరేషన్‌లో సగం వెనక్కి తిరిగి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఆ వివరాలలోకి వెళితే...
నిర్మాతకు నాలుగు కోట్లు వెనక్కి...
వీడు కొంచెం కాదు, చాలా మంచోడు జాక్!
'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా వచ్చిన సినిమా 'జాక్ వీడు కొంచెం క్రాక్' (Jack Movie). 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాల తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ నటించిన సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యంగా సినిమా ఫ్లాప్ అయ్యింది. నైజాంతో పాటు కొన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్లు లాస్ అయ్యారు. నిర్మాతను డబ్బులు వెనక్కి ఇవ్వమని అడుగుతున్నారని టాక్. ఈ నేపథ్యంలో నిర్మాతను ఆదుకోవడానికి హీరో ముందుకు వచ్చారు.
'జాక్' సినిమాకు గాను సిద్ధూ జొన్నలగడ్డ ఎనిమిది కోట్ల రూపాయిల పారితోషకం అందుకున్నారు. అందులో సగం అంటే నాలుగు కోట్ల రూపాయలను వెనక్కి ఇవ్వడానికి ఆయన ముందుకు వచ్చారు. ఇవాళ లేదంటే రేపో మాపో డబ్బులు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ చేతికి అందజేయనున్నారు.
'తెలుసు కదా'... అక్టోబర్ 17న సిద్ధూ సినిమా!
జాక్ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ 'తెలుసు కదా' సినిమాతో థియేటర్లలోకి రానన్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వం వహించిన ఆ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17న థియేటర్లలోకి రానుంది. 'జాక్' ప్రభావం ఆ సినిమా మీద పడకూడదని హీరో సిద్ధూ జొన్నలగడ్డ భావిస్తున్నారు. అందుకే ముందుగా ఆ సినిమా లాస్ అంతా సెటిల్ చేస్తున్నారు. హీరోలు ఈ విధంగా నష్టాలు భరించడానికి ముందుకు వస్తే నిర్మాతలకు అంతకుమించిన సంతోషం ఏమంటుంది!?
View this post on Instagram





















