Hari Hara Veera Mallu Postponed: వీరమల్లు వాయిదా? సెన్సార్, వీఎఫ్ఎక్స్ నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వరకు... ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్
Why Pawan Kalyan's HHVM Postponed? పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' వాయిదా పడిందని కొందరు, పడొచ్చని మరికొందరు... తెలుగు సినిమా & మీడియా వర్గాల్లో ఒక్కసారిగా ప్రచారం మొదలైంది. అసలు ఎందుకిలా జరుగుతోంది?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా తెరకెక్కిన 'హరిహర వీరమల్లు' విడుదల వాయిదా పడిందా? జూన్ 12న థియేటర్లలోకి రావడం లేదా? సుదీర్ఘంగా నాలుగేళ్ల పాటు నిర్మాణంలో ఉన్న సినిమా... ఇద్దరు దర్శకులు మారిన సినిమా... బోలెడంత ఖర్చు చేసిన సినిమా... పలుమార్లు వాయిదా పడి ఇంకేం సమస్యలు లేవని అంతా భావిస్తున్న తరుణంలో ఈ వాయిదా వార్తలు ఏమిటి? అసలు ఏమైంది? ఎందుకిలా జరుగుతోంది? అంటే...
సెన్సార్ దగ్గర్నుంచి లీకులు...
వాయిదా ప్రచారం వెనుక మతలబు!
జూన్ 12న థియేటర్లలోకి సినిమా రాదని, వాయిదా పడిందని బలమైన ప్రచారం జరగడం వెనుక సెన్సార్ ముందుకు సినిమా వెళ్లకపోవడమే. వాస్తవానికి జూన్ 3న సెన్సార్ జరగాలి. అయితే... జరగలేదు. ఎందుకు? అంటే... సినిమా ఇంకా పూర్తి కాలేదని గుసగుసలు వినిబడుతున్నాయి.
సీజీ, వీఎఫ్ఎక్స్ ఎందుకు కాలేదు...
సెన్సార్ ఆలస్యం వెనుక రీజన్ అదేనా?
టెక్నికల్ రీజన్స్ వల్ల జూన్ 3న 'హరిహర వీరమల్లు' సెన్సార్ కాలేదని ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలిసింది. సీజీ, వీఎఫ్ఎక్స్ వర్క్స్ పూర్తి కాలేదని, అందువల్ల సెన్సార్ కాలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం లేదు. సీజీ, వీఎఫ్ఎక్స్ పూర్తి కాలేదని సెన్సార్ అధికారులు సర్టిఫికెట్ ఇవ్వడం ఆపరు. సెన్సార్ చేయమని చెప్పరు. సెన్సార్ పూర్తి అయ్యాక విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ యాడ్ చేసుకోవచ్చు.
వాయిదా వెనుక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్...
రత్నం రేట్లకు డిస్ట్రిబ్యూటర్స్ వెనకడుగు!
వీరమల్లు వాయిదా వెనుక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మరో ఖబర్. ఈ సినిమా నిర్మాణానికి నాలుగేళ్లు పట్టింది. ఆ విషయం అందరికీ తెలుసు. ఇన్నేళ్లు అంటే ప్రొడక్షన్ బడ్జెట్ పక్కన పెడితే వడ్డీలు ఎక్కువ అవుతాయి. ఫైనాన్షియర్లకు బాకీలు క్లియర్ చేస్తే తప్ప విడుదలకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వరు. ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయితే వాళ్ళకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.
'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంకా పూర్తి కాలేదు. అందుకు రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి... నిర్మాత చెప్పే రేట్లకు డిస్ట్రిబ్యూటర్లు కాస్త ముందు వెనుక ఆలోచిస్తున్నారు. రెండు... ఇటీవల విడుదలకు ముందు 'ఆ నలుగురు' కుట్ర చేశారని వచ్చిన వార్తలు, పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడం! ట్రైలర్ రిలీజ్ అయితే బిజినెస్ క్లోజ్ అవుతుందని నిర్మాత ఏయం రత్నం నమ్మకంగా ఉన్నారు. సినిమా మీద బజ్ మరింత పెంచడంతో పాటు నిర్మాత అడిగిన రేట్లు వచ్చేలా ట్రైలర్ కృషి చేసినా... సో కాల్డ్ ఎగ్జిబిటర్స్ స్మూత్ రిలీజ్ కోసం థియేటర్లు ఇచ్చి డిస్ట్రిబ్యూటర్లకు ఎంత వరకు సహాయ సహకారాలు అందిస్తారనేది మరో ప్రశ్న.
పవన్ కళ్యాణ్ ఉండగా నిర్మాతకు టెన్షనా?'
వీరమల్లు తర్వాత మరో సినిమాకు అభయం!
ఏయం రత్నం చేతిలో మరొక సినిమా లేదు కనుక 'హరిహర వీరమల్లు'కు ఆయన అడిగిన రేట్లు ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్లు వెనకడుగు వేస్తున్నారని ఒక ప్రచారం సాగుతోంది. అయితే... మరో సినిమా చేస్తానని నిర్మాత ఏయం రత్నానికి పవన్ అభయం ఇచ్చారట. అందువల్ల, ఆ విషయంలో టెన్షన్ అవసరం లేదు. నిర్మాత ఆపదలో ఉంటే ఆదుకోవడానికి పవన్ ఎప్పుడూ ముందుంటారు.
ఒకవేళ వాయిదా పడితే... నెక్స్ట్ రిలీజ్ డేట్?
మళ్ళీ థియేటర్లలోకి వీరమల్లు వచ్చేది ఎప్పుడు?
ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వంటివి 'హరిహర వీరమల్లు' విడుదలకు అడ్డంకి కాదని యూనిట్ వర్గాల సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది. ఒకవేళ వాయిదా పడితే వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడం వల్ల అని అర్థం. వాయిదా పడితే... మళ్ళీ వీరమల్లు థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడు? అంటే... జూలై 4న.
జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' ఆ రోజు విడుదలకు సిద్ధం అవుతోంది. పవన్ కోసం 'సితార' సూర్యదేవర నాగవంశీ విడుదల తేదీ త్యాగం చేయడానికి అసలు వెనుకాడరు. 'కింగ్‌డమ్' చిత్రీకరణ కొంత పెండింగ్ ఉందని, అందువల్ల డేట్ అడ్జస్ట్ చేయడం పెద్ద సమస్య కాదని అంటున్నారు.
తిరుపతి ఈవెంట్ రోజు అన్నిటికీ క్లారిటీ...
జూన్ 8న తిరుపతిలో 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం 'ఓజీ' చిత్రీకరణ కోసం ముంబైలో ఉన్న పవన్, జూన్ 7న హైదరాబాద్ వస్తారు. అక్కడి నుంచి మర్నాడు తిరుపతి వెళతారు. ఆ రోజు విడుదల వాయిదా గురించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నిజంగా సినిమా వాయిదా పడితే ఫంక్షన్ జరగదు.
వాయిదా పడితే నిర్మాతకు నిజంగా ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది. మరో నెల వడ్డీ కట్టాల్సి వస్తుంది. అంతే కాకుండా... డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొన్న అమెజాన్ ప్రైమ్ వీడియో అగ్రిమెంట్ ప్రకారం ముందుగా కోట్ చేసిన అమౌంట్ కంటే 20 శాతం తక్కువ ఇస్తుంది. విడుదల వాయిదా పడితే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ రేటు తగ్గించేలా అగ్రిమెంట్ చేసుకున్నారు.
Also Read: వదిలేయండ్రా బాబూ... ఈవిడ 'ఖలేజా'లో దిలావర్ సింగ్ వైఫ్ కాదు... ఇదిగో క్లారిటీ





















