అన్వేషించండి

Sid Sriram - Spark Song : 'స్పార్క్'లో సిద్ శ్రీరామ్ సాంగ్ - ఏమా అందం, అద్భుతం

విక్రాంత్ కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా 'స్పార్క్'. ఇందులో సిద్ శ్రీరామ్ ఓ పాట పాడారు. తాజాగా ఆ సాంగ్ విడుదల చేశారు.

విక్రాంత్ (Vikranth)ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ... డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ సంస్థ భారీ నిర్మాణ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పార్క్ L.I.F.E' (Spark Movie). ఇందులో మెహ్రీన్ కౌర్ పిర్జాదా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు హీరో విక్రాంత్ దర్శకత్వం వహించడం విశేషం. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సినిమాలో తొలి  పాటను తాజాగా విడుదల చేశారు. 

సిద్ శ్రీరామ్ పాడిన 'ఏమా అందం'
లిరిసిస్ట్ అనంత శ్రీరామ్, సింగర్ సిద్ శ్రీరామ్ (Sid Sriram)లది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్! 'గీత గోవిందం' సినిమాలో 'ఇంకేం ఇంకేం కావాలే' మొదలుకొని ఇప్పటివరకు వాళ్ళ కలయికలో ఎన్నో హిట్ సాంగ్స్ వచ్చాయి. ఇప్పుడీ 'స్పార్క్' సినిమాలో సాంగ్ కూడా ఆ హిట్ సాంగ్స్ జాబితాలో చేరుతుందని చెప్పవచ్చు. 

మలయాళ సినిమా 'హృదయం'తో భాషలకు అతీతంగా శ్రోతలను ఆకట్టుకున్న సంగీత దర్శకుడు హిషామ్ అబ్దుల్ వాహబ్. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి'కి కూడా చార్ట్ బస్టర్ ఆల్బమ్ అందించారు. 'స్పార్క్' సినిమాకు ఆయన సంగీతం అందిస్తున్నారు. 

''ఏమా అందం ఏమా అందం
భామా నీకు భువితో ఏమి సంబంధం
ఏం సంబంధం?'' అంటూ అనంత శ్రీరామ్ రాసిన పాటను సిద్ శ్రీరామ్ పాడారు. ఈ పాటలో సాహిత్యం, సిద్ శ్రీరామ్ గాత్రం, పిక్చరైజ్ చేసిన తీరు అద్భుతంగా ఉన్నాయి. మెలోడీ బావుంది. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆదిత్య మ్యూజిక్ ఛానల్ లో ఈ పాట విడుదలైంది. 

Also Read : విజయ్ 'లియో'కి ఆ దేశంలో నో కట్స్ - మరి, మన దేశంలో?

నవంబర్ 17న 'స్పార్క్' విడుదల!
నవంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'స్పార్క్' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. కొత్త హీరో, కొత్త దర్శకుడు అయినప్పటికీ... ప్రచార చిత్రాలు, పాటలు బావుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. టీజర్ చూస్తే ఇదొక చిన్న సినిమా అని ఎక్కడా కనిపించలేదు. ప్రేమ, యాక్షన్, ప్రతీకారం సినిమాలో ఉన్నాయని టీజర్ ద్వారా చెప్పారు.

Also Read : రియల్ లైఫ్‌లో హీరో హీరోయిన్‌కు పెళ్లైంది - అశోక్ సెల్వన్ భార్య ఎవరో తెలుసా?

విలన్‌గా గురు సోమసుందరం
మలయాళంలో రూపొందిన సూపర్ హీరో సినిమా 'మిన్నల్ మురళి'. అందులో టీ షాపులో పని చేసే వ్యక్తికి సూపర్ పవర్స్ వస్తాయి చూడండి! ఆ క్యారెక్టర్‌లో యాక్ట్ చేసిన గురు సోమసుందరం (Guru Somasundaram) గుర్తు ఉన్నారా? ఇప్పుడు ఆయన తెలుగులో సినిమా చేస్తున్నారు. అదీ ప్రతినాయకుడిగా! విలన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారన్నమాట!
 
'స్పార్క్'లో నాజ‌ర్‌, సుహాసిని మ‌ణిర‌త్నం, 'వెన్నెల' కిశోర్, షాయాజీ షిండే, సత్య, 'వెన్నెల' కిశోర్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ తదితరులు ప్రధాన తారాగణం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు దగ్గర సహాయకుడిగా పని చేసిన రవి వర్మ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
DC Movie OTT : ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
Irumudi Trailer : ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
Embed widget