అన్వేషించండి

Shruti Hassan: మీరు సౌత్ నుంచా అని అడుగుతున్నారు, ‘సలార్’ క్రెడిట్ ఆయనదే: శృతి హాసన్

Shruti Hassan: ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్’లో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా దర్శకుడికే ఇచ్చేసింది.

Salaar Movie: ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్’ సినిమా డిసెంబర్ 22న విడుదలయ్యి.. ప్రేక్షకుల దగ్గర నుంచి పాజిటివ్ టాక్ అందుకుంటోంది. తమ అభిమాన హీరో ఎప్పుడెప్పుడు కమ్ బ్యాక్ ఇస్తాడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్‌కు ‘సలార్’తో ఫుల్ మీల్స్ లభించింది. ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించాడు. ఇక హీరోయిన్‌గా శృతి హాసన్ నటించింది. తాజాగా ఒక బుల్లితెర ఈవెంట్‌లో పాల్గొన్న శృతిహాసన్.. ‘సలార్’ గురించి, ప్రభాస్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా సౌత్ ఇండస్ట్రీ గురించి కూడా ఆసక్తికర స్టేట్‌మెంట్ చేసింది.

సలార్ హిట్ సందర్భంగా దావత్

న్యూ ఇయర్ కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో పాటు బుల్లితెర నటీనటులను ఒక్క దగ్గరికి తీసుకొచ్చి స్టార్ మా ఒక ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. అదే ‘మోస్ట్ అవేయిటెడ్ దావత్ (మ్యాడ్)’. ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన శృతి హాసన్ గురించి ఒక స్పెషల్ ప్రోమో విడుదలయ్యింది. తనను చూడగానే ‘‘మా దావత్‌కు శృతి హాసన్ వచ్చింది’’ అంటూ సంతోషంతో అరిచాడు రవి. ఆ తర్వాత ‘‘2024 అద్భుతంగా ఉండబోతుంది’’ అని చెప్తూ అందరిలో జోష్ నింపింది శృతి. ‘‘సలార్ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయినందుకే ఈ దావత్’’ అన్న రవి.. ప్రభాస్‌తో కలిసి పనిచేయడం ఎలా ఉందని తనను అడిగాడు.

ప్రభాస్ చాలా కేరింగ్

‘‘దావత్ అంటే ముందుగా గుర్తొచ్చేది ప్రభాసే. మొదటి షెడ్యూల్‌ జరుగుతున్నప్పుడు సెట్‌లో నలుగురు ఉన్నారని చెప్పాను. కానీ తను 400 మందికి సరిపడా ఫుడ్‌ను పంపించాడు. తను చాలా కేరింగ్ పర్సన్’’ అంటూ ప్రభాస్ గురించి గొప్పగా చెప్పింది శృతి హాసన్. ఆ తర్వాత ‘సలార్’ సక్సెస్ క్రెడిట్‌ను ప్రభాస్‌తో పాటు శృతికి ఇచ్చాడు రవి. కానీ ఆ మాటకు శృతి ఒప్పుకోలేదు. ‘‘లేదు. ప్రతీది ఒక విజన్‌తోనే మొదలవుతుంది. అది ప్రశాంత్ సార్‌ది. నాకు తెలిసి ప్రభాస్ కూడా ఒప్పుకుంటాడు’’ అంటూ ‘సలార్’ సక్సెస్ క్రెడిట్ అంతా ప్రశాంత్‌ నీల్‌కు ఇచ్చింది శృతి. అంతే కాకుండా నార్త్, సౌత్ అంటూ సినీ పరిశ్రమల మధ్య జరుగుతున్న పోటీపై కూడా తను స్పందించింది.

దుమ్ము లేపుతున్నాయి

‘‘ప్రస్తుతం ప్రత్యేకంగా ఒక డిస్కషన్ నడుస్తోంది. నార్త్, సౌత్ అని. మీరు సౌత్ నుంచి కదా అని అడుగుతున్నారు. అవును మేము సౌత్‌కు చెందినవాళ్లమే. మా సినిమాల్లో దుమ్ము లేపుతున్నాయి. మన మనసు నుంచి, మన నేల నుంచి పుట్టిన మన కథలు ప్రపంచవ్యాప్తంగా చేరుతున్నాయి. సలార్ కూడా అందులో ఒకటే’’ అంటూ సౌత్ సినిమాల గురించి గర్వంగా చెప్పింది శృతి హాసన్. డిసెంబర్ 22న విడుదలయిన ‘సలార్’.. బెనిఫిట్ షో నుండే పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తోంది. ప్రేక్షకుల దగ్గర నుంచి పాజిటివ్ రివ్యూలను అందుకోవడం మాత్రమే కాకుండా ఓపెనింగ్ డే కలెక్షన్స్ విషయంలో ఇప్పటికే పలు రికార్డులను బ్రేక్ చేసింది. మొదటిరోజే దేశవ్యాప్తంగా రూ.95 కోట్లను కలెక్ట్ చేసింది ‘సలార్’. దీంతో ఈ సినిమా 2023లో విడుదలయిన అన్ని చిత్రాల్లో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ను అందుకున్న సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

Also Read: 19 ఏళ్లకే మూవీ ఛాన్స్, రిపోర్టర్‌తో ప్రేమాయణం - ‘సలార్’ పృథ్విరాజ్ గురించి ఈ విషయాలు తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget