Prithviraj Sukumaran: 19 ఏళ్లకే మూవీ ఛాన్స్, రిపోర్టర్‌తో ప్రేమాయణం - ‘సలార్’ పృథ్విరాజ్ గురించి ఈ విషయాలు తెలుసా?
Salaar Movie: ‘సలార్’తో తన ఖాతాలో పాన్ ఇండియా హిట్‌ను యాడ్ చేసుకున్న పృథ్విరాజ్ సుకుమారన్ గురించి పలువురు తెలుగు ప్రేక్షకులకు తెలియదు.
Salaar Prithviraj Sukumaran: ఎన్నో ఏళ్లుగా మలయాళ సినీ పరిశ్రమలో హీరోగా, విలన్‌గా పాత్రలు పోషిస్తూ.. తన వర్సటైల్ యాక్టింగ్‌తో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు పృథ్విరాజ్ సుకుమారన్. తన కెరీర్‌లో ఎక్కువగా మలయాళ చిత్రాల్లోనే నటించాడు. అందుకే ఆ భాష సినిమాలు చూసే మూవీ లవర్స్‌కు పథ్విరాజ్ పేరు సుపరిచితమే. కానీ ‘సలార్’లాంటి పాన్ ఇండియా మూవీలో వరధరాజా మానార్ పాత్రలో నటించిన తర్వాత సౌత్ ప్రేక్షకులకు తను మరింత దగ్గరయ్యాడు. పృథ్విరాజ్ గురించి చాలామంది ప్రేక్షకులకు తెలియని పలు ఆసక్తికర విషయాలు ఇవే
1. పృథ్విరాజ్ సుకుమారన్‌కు 24 ఏళ్లు ఉన్నప్పుడే ‘వాస్తవం’ అనే సినిమాలో తన నటనకు ఉత్తమ నటుడిగా ‘కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్’ అందుకున్నాడు. అంత చిన్న వయసులో ఈ అవార్డ్ అందుకున్న మొట్టమొదటి హీరో పృథ్విరాజ్. 2006లో విడుదలయిన ఈ పొలిటికల్ డ్రామా చిత్రం తాగఱి శివశంకర రాసిన ‘ఎనిప్పడికల్’ అనే నవల ఆధారంగా తెరకెక్కింది.
2. స్కూల్ నుండే పృథ్విరాజ్ సుకుమారన్‌కు చదువుతో పాటు నటన అంటే ఆసక్తి ఉండేది. అందుకే తన సోదరుడు ఇంద్రజిత్‌తో కలిసి నాటకాల్లో పాల్గొనేవాడు. ఎన్నో షేక్‌స్పియర్ క్యారెక్టర్లకు స్టేజ్‌పైన ప్రాణం పోశాడు పృథ్వి. ఇక తను యూనివర్సిటీ ఆఫ్ టస్మానియాలో డిగ్రీ చదువుతున్న సమయంలో ఒక ఆడిషన్‌లో పాల్గొని ‘నందనం’ అనే చిత్రంలో నటించడానికి ఛాన్స్ కొట్టేశాడు. ఈ మూవీ 2002లో విడుదలయ్యింది.
3. పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా మారడానికి దర్శకుడు ఫాజిలే కారణం. తన స్క్రీన్ టెస్ట్ రిజల్ట్స్‌ను దర్శకుడు రంజిత్‌కు చూపించి.. పృథ్వికు ‘నందనం’ సినిమాలో ఛాన్స్ వచ్చేలా చేశారు ఫాజిల్. అప్పటికీ పృథ్వి వయసు 19 ఏళ్లే అయినా.. పాత్రకోసం గడ్డం పెంచమని అడిగాడు దర్శకుడు రంజిత్. ఆ తర్వాతే తనను సినిమాకు ఎంపిక చేశాడు.
Also Read: ఆ మూడు చిత్రాల రికార్ట్స్‌ను బ్రేక్ చేసిన ‘సలార్’, ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?
4. హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కొంతకాలానికే దర్శకుడు సంతోష్ శివన్, వ్యాపారవేత్త షాజీ నటేషన్‌తో కలిసి 2009లో ‘ఆగస్ట్ సినిమా’ అనే సొంత ప్రొడక్షన్ హౌజ్‌లో ప్రారంభించారు. ఆ బ్యానర్‌లో 2011లో సంతోష్ శివన్ దర్శకత్వంలో ‘ఉరిమి’ అనే చిత్రాన్ని నిర్మించారు. అప్పట్లో భారీ బడ్జెట్ మలయాళ సినిమాల లిస్ట్‌లో ‘ఉరిమి’ రెండో స్థానంలో నిలిచింది.
5. యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా సక్సెస్ సాధించిన తర్వాత 2019లో డైరెక్షన్‌లోకి ఎంటర్ అయ్యాడు పృథ్విరాజ్ సుకుమారన్. మోహన్‌లాల్ హీరోగా ‘లూసీఫర్’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసి తాను మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు. కేవలం 21 రోజుల్లోనే రూ.150 కోట్ల కలెక్షన్స్ సాధించి.. అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన మలయాళ చిత్రంగా ‘లూసీఫర్’ రికార్డ్ సాధించింది. ఇంకా ఈ సినిమాకు రెండు సీక్వెల్స్ తెరకెక్కనున్నాయి.
6. పృథ్విరాజ్ సుకుమారన్ వాయిస్‌కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే సింగింగ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. 2009లో విడుదలయిన ‘పుథియ ముఖం’ అనే చిత్రంలో ‘కానే కానే’ అనే పాటను పాడారు. దీపక్ దేవ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. తను పాడిన పాటకు మంచి ప్రశంసలు దక్కడంతో ఆ తర్వాత మరెన్నో పాటలకు కూడా తన స్వరాన్ని అందించారు పృథ్వి.
7. సినిమాల్లో మాత్రమే కాదు.. సామాజిక విషయాల్లో కూడా పృథ్విరాజ్ చాలా యాక్టివ్‌గా ఉండేవారు. కేరళ ప్రభుత్వం ప్రారంభించిన కేరళ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ప్రాజెక్ట్‌లో భాగమయిన ‘ఆరోగ్యకేరళం’ అనే మెషిన్‌కు పృథ్వి బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరించారు. ఈ మెషీన్‌లో భాగంగా 2010లో అత్యవసర చికిత్స అవసరమయిన వారికోసం 25 హైటెక్ ఆంబులెన్స్‌లను ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం.
8. బీబీసీ ఇండియాలో రిపోర్టర్‌గా పనిచేసిన సుప్రియా మీనన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011 ఏప్రిల్ 25న పాలక్కాడ్‌లో కేవలం బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. 2014లో వారికి ఒక పాప పుట్టింది.
View this post on Instagram
Also Read: వేణు స్వామి ఎక్కడ? - ప్రభాస్ కెరీర్ కష్టం అన్నాడే, హిట్ రాదని చెప్పాడే!