Shruti Haasan: లవ్ అంటే నమ్మకమే... మ్యారేజ్ అంటే మాత్రం చాలా భయం - పెళ్లిపై శ్రుతి హాసన్ ఏం చెప్పారంటే?
Shruti Haasan: పెళ్లంటే భవిష్యత్తును పంచుకోవడమని... అది ఓ జీవితకాలపు బాధ్యత అని హీరోయిన్ శ్రుతి హాసన్ అన్నారు. వివాహ బంధం పట్ల తనకు భయం ఉందన్నారు.

Shruti Haasan About Love And Marriage: తనకు ప్రేమంటే నమ్మకమేనని... కానీ పెళ్లంటేనే భయమని హీరోయిన్ శ్రుతి హాసన్ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్, వివాహం వంటి విషయాల గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
పెళ్లంటే భయం
తాను వివాహ బంధాన్ని దానికి సంబంధించిన విలువలను గౌరవిస్తానని... కానీ వాటిని ధ్రువీకరించడానికి ఓ చట్టపరమైన కాగితం అవసరం లేదు అనేది తన అభిప్రాయమని శ్రుతి హాసన్ చెప్పారు. 'కెరీర్‌ను ఉన్నతంగా మలుచుకోవడానికి నాకంటూ పాపులారిటీ సంపాదించుకోవడానికి చాలా శ్రమించాను. ఆ గుర్తింపును ఓ కాగితం ముక్కతో ముడిపెట్టాలనే ఆలోచన భయంకరంగా అనిపిస్తుంది. ఇప్పటికే ఓసారి పెళ్లికి దగ్గరగా వెళ్లాను. అనుకోని కారణాలతో ఆ బంధం మధ్యలోనే ముగిసింది.
పెళ్లంటే ఇద్దరు మనుషులు ఒక్కటి కావడమే కాదు. భవిష్యత్తును పంచుకోవడం. లైఫ్ లాంగ్ ఒకరి రెస్పాన్సిబిలిటీని మరొకరు తీసుకోవడం. పిల్లల్ని పెంచడం ఇలా ఎన్నో ఉంటాయి. వివాహమంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించినది మాత్రమే కాదు. ఓ జీవితకాలపు బాధ్యత.' అని స్పష్టం చేశారు.
Also Read: సూపర్ మ్యాన్ రివ్యూ: కమల్ 'ఇండియన్ 2'ను గుర్తు చేసే సీన్... మరి, సినిమా? డీసీ హిట్టు కొట్టిందా?
టాలీవుడ్... ఫస్ట్ బెస్ట్ మూవీ
తన జీవితాన్ని పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్' మూవీ మలుపు తిప్పిందని... తనకు మంచి గుర్తింపు తెచ్చిందని శ్రుతి (Shruti Haasan) తెలిపారు. 'మొదట సినిమాలో నాకు నటించే ఛాన్స్ వచ్చినప్పుడు కొన్ని కారణాలతో నటించనని చెప్పాను. కానీ హరీశ్ శంకర్ ఆ పాత్రలో నన్ను తప్ప వేరే నటిని ఊహించుకోలేనన్నారు. చివరకు అంగీకరించా. ఈ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. ఆడియన్స్‌కు నన్ను మరింత దగ్గర చేసింది. నాకు ఫస్ట్ సక్సెస్ అందించింది తెలుగు పరిశ్రమ. పవన్ కల్యాణ్ సెట్‌లో అందరితో చాలా గౌరవంగా మాట్లాడేవారు.' అని చెప్పారు.
జ్యోతిష్యాన్ని గట్టిగా నమ్ముతా
తాను జ్యోతిష్యాన్ని గట్టిగా నమ్ముతానని శ్రుతి తెలిపారు. 'మా నాన్న మాత్రం జ్యోతిష్యం విషయంలో పూర్తిగా డిఫరెంట్. మా ఇంట్లో దేవుళ్ల ఫోటోలు లేవు. కానీ నాన్న నాపై ఎప్పుడు తన అభిప్రాయాలు, నమ్మకాలు రుద్దలేదు. ఈ విషయంలో నాన్నకు నేను వ్యతిరేకంగా అయినప్పటికీ నా అభిప్రాయాల్ని గౌరవిస్తుంటారు.' అని చెప్పారు.
సినిమాల విషయానికొస్తే... సూపర్ స్టార్ రజినీకాంత్ 'కూలీ' (Coolie) మూవీలో నటించారు శ్రుతి హాసన్. తలైవాతో పాటు కింగ్ నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ కపూర్, సత్యరాజ్, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించగా... సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్ తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించగా... పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేశారు. ఆగస్ట్ 14న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో మూవీని రిలీజ్ చేయనున్నారు. ఐమాక్స్ ఫార్మాట్‌లోనూ మూవీని అందుబాటులోకి తెస్తున్నారు.





















