Shriya Saran: మదర్ రోల్స్ వైపు షిఫ్ట్ అవుతున్న శ్రియ... అప్పుడు 'దృశ్యం', 'ఆర్ఆర్ఆర్' - ఇప్పుడు 'మిరాయ్'
Shriya Saran Mother Roles: టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ రోల్స్ చేసిన శ్రియ ఇప్పుడు మెల్లగా మదర్ రోల్స్ వైపు షిఫ్ట్ అవుతున్నారు. నటిగా కొత్త రూట్ తీసుకున్నారు.

తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని హీరోయిన్లలో శ్రియ శరణ్ (Shriya Saran) ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్... సీనియర్ స్టార్ హీరోల సరసన సినిమాలు చేశారు. వాళ్ల తర్వాత తరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన హీరోయిన్ రోల్స్ చేశారు. ఒకప్పుడు హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేసిన ఆవిడకు, ఇప్పుడు ఆ తరహా క్యారెక్టర్లు రావడం లేదు. దాంతో మెల్లగా మదర్ రోల్స్ వైపు షిఫ్ట్ అవుతున్నారు.
అప్పుడు దృశ్యం, ఆర్ఆర్ఆర్...
ఇప్పుడు తేజా సజ్జా 'మిరాయ్'!
Shriya Saran Mother Roles In Telugu Movies: శ్రియ శరణ్ మదర్ రోల్స్ వైపు అడుగులు వేయడం కొన్నేళ్ల క్రితం మొదలు అయింది. పవన్ కళ్యాణ్, వెంకటేష్ నటించిన 'గోపాల గోపాల' సినిమా గుర్తుందా? అందులో ఆవిడది వెంకీ భార్య పాత్ర. ఇద్దరు పిల్లల తల్లిగా శ్రియా శరణ్ కనిపించారు. వెంకటేష్ సరసన నటించిన మరో సినిమా 'దృశ్యం'లో సైతం ఆవిడది హీరోకి భార్య / హీరో పిల్లలుకు తల్లి పాత్రలే. రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'లో అజయ్ దేవగన్ భార్య పాత్రలో కనిపించారు శ్రియ. అంటే రామ్ చరణ్ తల్లి అన్నమాట.
'గోపాల గోపాల, దృశ్యం, ఆర్ఆర్ఆర్'... మూడు సినిమాలలోనూ శ్రియ శరణ్ మదర్ రోల్స్ చేశారు. అయితే... అయా సినిమాలలో హీరోలకు మదర్ రోల్ చేయలేదు. హీరోకు భార్యగా, పిల్లలకు తల్లిగా కనిపించారు. ఆ సినిమాలలో శ్రియ పిల్లలను చిన్న వాళ్ళగా చూపించారు. 'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ చైల్డ్ హుడ్ ఎపిసోడ్స్‌లో తల్లిగా కనిపించారు. త్వరలో విడుదల కానున్న 'మిరాయ్'లో మాత్రం అలా కాదు.
Shriya Saran Role In Mirai Movie: 'మిరాయ్' ట్రైలర్ చూస్తే... హీరో తేజా సజ్జా తల్లిగా శ్రియా శరణ్ కనిపిస్తారని చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. ఏజ్డ్ సీన్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు శ్రియ వయసు 40 సంవత్సరాలు. హీరోయిన్ రోల్స్ రావడం కష్టం. సీనియర్ స్టార్ హీరోల సరసన తప్పిస్తే యంగ్ హీరోల సినిమాలలో ఆవిడను హీరోయిన్‌గా తీసుకునే అవకాశం లేదు. ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ కూడా ఆవిడకు తెలుసు. అందుకే యంగ్ హీరోలకు మదర్ రోల్స్ చేయడానికి సైతం ముందడుగు వేశారు.
'మిరాయ్'తో కథానాయిక కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా శ్రియ శరణ్ కొత్త అడుగు వేశారని చెప్పవచ్చు. దీని వల్ల ఆవిడను దృష్టిలో పెట్టుకుని కొంత మంది దర్శక నిర్మాతలు క్యారెక్టర్లు రాసే అవకాశం ఉంది. ఆవిడకు మరిన్ని సినిమాలు వస్తాయి. లైమ్ లైట్‌లో ఉండే అవకాశం ఉంటుంది అందువల్ల సీనియర్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ రోల్స్ కూడా వస్తాయి. ఈ విధంగా మదర్ రోల్స్ వైపు షిఫ్ట్ అయిన బాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది ఉన్నారు వాళ్ళ రూటులో శ్రియా శరణ్ పయనిస్తున్నారని చెప్పవచ్చు. అయితే తన వయసు ఉన్న, తనతో పాటు హీరోయిన్ రోల్స్ చేసిన త్రిష ఇంకా హీరోయిన్ కింద చేస్తున్నారు. కానీ శ్రియ మాత్రం అలా క్రేజ్ నిలబెట్టుకోలేదు. మదర్ రోల్స్ వైపు టర్న్ అయ్యారు.





















