Stree 2 34 Day Box Office collection: ప్రభాస్ హీరోయిన్ 'స్త్రీ 2' సంచలన వసూళ్లు - ఏకంగా షారుక్ ఖాన్ 'జవాన్' రికార్డు బ్రేక్, రూ. 600 కోట్ల దిశగా..
Stree 2 Box Office Collection: బాలీవుడ్‌లో చిన్న సినిమాగా వచ్చిన స్త్రీ 2 మూవీ ఏకంగా షారుక్ ఖాన్ జవాన్ సినిమా రికార్డు బ్రేక్ చేసిం హిందీలో హయ్యేస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
Stree 2 34 Days Box Office Collections: ఎలాంటి అంచనాలు లేకుండ చిన్న సినిమాగా వచ్చిన బాలీవుడ్ లేటెస్ట్ మూవీ 'స్త్రీ 2'(Stree 2 Collections). 2018లో వచ్చిన 'స్త్రీ' మూవీకి ఇది సీక్వెల్. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ (Shraddha Kapoor), టాలెంటెడ్ నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో హారర్, కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండ థియేటర్‌లోకి వచ్చింది. విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి ఊహించని రెస్పాన్స్ అందుకుంది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటోంది.
హిందీ బాక్సాఫీసు వద్ద సునామీ వసూళ్లు రాబడుతుంది. సినిమా విడుదలైన నెల రోజులు గడిచిన ఇప్పటికీ థియేటర్లో అదే జోరు చూపిస్తుంది. తాజాగా ఈ సినిమా ఏకంగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ (Stree 2 Beats Shah Rukh Khan Jawan Movie)చిత్రాన్ని బీట్ చేసింది. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా షారుక్ జవాన్ ఉంది. తాజాగా ఆ రికార్డును 'స్ట్రీ 2' తుడిచిపెట్టింది. ఇప్పుడు హిందీలో అత్యధిక వసూల్లు చేసిన చిత్రం స్త్రీ 2 రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా విడుదలై నేటితో 34వ రోజులు గడిచింది.
ఇప్పటికీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కోట్ల వసూళ్లు చేస్తుంది. 34వ రోజు ఈ సినిమా రూ. 2.65 కోట్లు రాబట్టింది. జవాన్ రూ. 2.50 కోట్లు రాబట్టింది. 34 రోజుల్లో మొత్తంగా 'స్త్రీ 2' రూ. 586 కోట్లు వసూళ్లు చేసి రూ. 600 కోట్ల మార్క్ వైపుగా దూసుకుపోతుంది. దీంతో స్త్రీ 2 జవాన్ మూవీ మొత్తం వసూళ్లను బ్రేక్ చేసింది. షారుక్ జావాన్ థియేట్రికల్ రన్‌లో రూ. 583 కోట్లు వసూళ్లు చేసింది. ఇక అదీ ఈ సినిమా తెలుగు, తమిళంలోనూ రిలీజ్ అయ్యింది. దీంతో 34 రోజుల్లోనే జవాన్ మూవీ వసూళ్లను బీట్ చేసి రికార్డుకు ఎక్కింది. ఒక చిన్ని సినిమా ఈ రేంజ్‌లో వసూళ్లు చేస్తుండటంతో సినీ విశ్లేషకులు సైతం సర్‌ప్రైజ్ అవుతున్నారు.
Also Read: జానీ మాస్టర్ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు - ఆయన భార్య కూడా వేధించిందంటూ బాధితురాలు ఆరోపణలు
రెండు వారాల్లోనే బాహుబలి, కేజీయఫ్ రికార్డు బ్రేక్
'స్త్రీ 2' రిలీజైన రెండువారాల్లోనే హిందీ బాక్సాఫీసు వద్ద రూ. 445 కోట్లు వసూళు చేసింది. దీంతో రెండు వారాలకే ఇది బాహుబలి, కేజీయఫ్ చిత్రాల రికార్డులను బ్రేక్ చేసింది. రాజమౌళి చిత్రం 'బాహుబలి: ది బిగినింగ్' రెండు వారాల్లో రూ. 421 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. అలాగే 'కేజీఎఫ్' రూ. 435 కోట్ల రికార్డును సైతం అధిగమించింది. ఇక తాజా వసూళ్లతో స్త్రీ 2 హిందీలో పాన్ ఇండియా సినిమాల కలెక్షన్స్‌ని స్త్రీ 2 బ్రేక్ చేసింది. ఇలా గద్దర్ 2 రూ. 525.7, పఠాన్ రూ. 543.09, యానిమల్ రూ. 553.87, తాజాగా జావాన్ రూ. 583 కోట్ల కలెక్షన్స్ అధిగమించి హిందీలో సరికొత్త రికార్డు నెలకొల్పింది.