అన్వేషించండి

Ticket Rates: మూవీ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌ - రూ. 99కే మల్టీప్లెక్స్‌లో సినిమా - బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన మల్టీప్లెక్స్ అసోసియేషన్

Multiplex Dropped Tickets Cost: మూవీ లవర్స్‌కి మల్టీప్లెక్స్‌ థియేటర్లు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించాయి. ఆ రోజున దేశంలో ఎక్కడైన, ఏ షో అయిన రూ. 99 సినిమా చూడోచ్చు టికెట్స్‌ రేట్స్‌ని భారీగా తగ్గించింది. 

Multiplex Dropped Ticket Prices For Rs 99: ప్రస్తుతం బిజీ లైఫ్‌లో జనాలకు ఎంటర్‌టైన్‌ కావాలంటే సినిమాలే. రిలాక్సేషన్‌ కోసం అలా సినిమా చూద్దామంటే మల్టీప్లెక్స్‌ (Multiplex Ticket Rates Dropped) ఆడియన్స్‌ని భయపెడుతున్నాయి. ప్రస్తుతం కాలం మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలంటే సాధారణ జనం జంకుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ అయితే వణికిపోతున్నారు. సాధారణ థియేటర్లలో టికెట్ ధర రూ.50 నుంచి రూ. 200లోపు ఉంటే, మల్టీప్లెక్స్‌లలో ఆ రేటు కాస్త ఎక్కువే. ట్యాక్స్ లు అన్ని  కలిపి రూ.300 నుంచి రూ.500 వరకూ ఉంటుంది. దీంతో మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలంటేనే సామాన్య ప్రజలు బయపడిపోతున్నారు.

రూ. 99కే మూవీ టికెట్

Multiplex Association Of India Bumper Offer: పోనీ ఫ్యామిలీ సింగిల్‌ స్క్రీన్స్‌కి వెళ్లాలంటే  మాస్‌ ఆడియన్స్‌తో బాధ. మల్టీప్లెక్స్‌కి వెళ్లాలంటే టికెట్ల, ఇంటర్వెల్‌ స్నాక్స్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక్కసారి కుటుంబంతో థియేటర్లోకి అడుగుపెడితే జేబు ఖాళీ అవ్వాల్సిందే. దీంతో ఫ్యామిలీ, మధ్య తరగతి ప్రేక్షకులు మల్టీప్లెక్స్‌ థియేటర్లోకి వెళ్లాలంటే బెంబెలెత్తిపోతున్నారు. అలాంటి మూవీ లవర్స్‌కి మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది. కేవలం రూ. 99 రూపాయలకే (Ticket Rates Rs 99) సినిమా చూడోచ్చంటూ మల్టీప్లెక్స్‌లు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించాయి. అయితే ఈ ఆఫర్‌ ఒక్కరోజు మాత్రమే. సెప్టెంబర్‌ 20న నేషనల్‌ సినిమా డే (National Cinema Day) సందర్భంగా మల్టీప్లెక్స్‌ చైన్ థియేటర్లు ఈ ఆఫర్‌ని ప్రకటించాయి. అంటే సెప్టెంబర్‌ 20న దేశవ్యాప్తంగా ఏ భాష సినిమా అయినా, ఏ షో అయినా 99 రూపాయలకే సినిమా చడోచ్చు.

Also Read: అక్కడ భారీగా మిడ్‌నైట్ బెనిఫిట్‌ షోలకు ప్లాన్‌, టికెట్‌ రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే!

ఈ ఆఫర్ వాటికి వర్తించదు

తాజాగా దీనికి బాలీవుడ్‌ మూవీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్స్‌ ఎక్స్‌ వేదికగా ప్రకటించాడు. కాగా మల్టీప్లెక్స్‌ థియేటర్లు పీవీఆర్ (PVR), ఐనాక్స్ (Inox Theatres), మిరేజ్, ఏషియన్, సినీపోలిస్ లాంటి చైన్లతో పాటు దేశ‌వ్యాప్తంగా ఉన్న 4 వేలకుపైగా స్క్రీన్లలో సెప్టెంబర్ 20న దేశంలో ఎక్కడైన కూడా టికెట్‌ ధరలు రూ. 99కే ఉండనున్నాయి. దీంతో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లో కంటే తక్కువ రేట్స్‌కే ఆ రోజు మల్టీప్లెక్స్‌లో ఎంచక్కా సినిమా చూసేయచ్చు. ఇది తెలిసి సామాన్య ఆడియన్స్‌ మూవీ లవర్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ అవకాశాన్ని 3D, రెక్లైనర్లు, ప్రీమియం ఫార్మాట్‌ స్క్రీన్లకు ఈ ఆఫర్ వర్తించదు. మరి ఇంకేందుకు మూవీ లవర్స అంతా ఈ శుక్రవారం 99 రూపాయలకే మల్టీప్లెక్స్‌ల్లో సినిమా చూసేయండి. 

Also Read: జానీ మాస్టర్‌ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు - ఆయన భార్య కూడా వేధించిందంటూ బాధితురాలు ఆరోపణలు

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget