News
News
వీడియోలు ఆటలు
X

Sharwanand Marriage Date : జూన్ తొలివారంలో శర్వానంద్ పెళ్లి - ఎప్పుడు, ఎక్కడ అంటే?

శర్వానంద్ నిశ్చితార్థం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయ్. వాటిని శర్వా టీమ్ ఖండించింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. ఆయన పెళ్లి తేదీ ఖరారు అయ్యింది. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. 

FOLLOW US: 
Share:

యంగ్ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) అతి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. రక్షిత (Sharwanand fiance Rakshita)తో ఏడు అడుగులు వేయడానికి ఆయన రెడీ అయ్యారు. శర్వా నిశ్చితార్థం, పెళ్లి గురించి సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. అయితే, వాటిని హీరో టీమ్ ఖండించింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఆయన పెళ్లి తేదీ ఖరారు అయ్యింది. 

జూన్ & జైపూర్... శర్వా పెళ్లికి రెడీ!
శర్వానంద్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. అయితే, ఆయన విదేశాలు వెళ్లడం లేదు. మన ఇండియాలోనే పెళ్లి చేసుకోనున్నారు. జూన్ 2, 3 తేదీల్లో రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ (Leela Palace Jaipur)లోని లీలా ప్యాలెస్‌లో ఆయన పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సన్నిహితులకు ఆల్రెడీ శర్వానంద్ ఆహ్వానాలు అందజేశారని తెలిసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు యువి క్రియేషన్స్ అధినేతలతో ఒకరైన విక్రమ్, ఇంకా కొంత మంది పెళ్ళికి హాజరు కానున్నారు.

జనవరిలో నిరాడంబరంగా నిశ్చితార్థం
మొన్నటి వరకు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో శర్వానంద్ పేరు చాలా బలంగా వినిపించేది. 'అన్ స్టాపబుల్' షోలో నట సింహం నందమూరి బాలకృష్ణ 'పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్?' అని అడిగితే... ''ప్రభాస్ తర్వాత'' అని శర్వానంద్ సమాధానం ఇచ్చారు. విశేషం ఏమిటంటే... ప్రభాస్ కంటే ముందు శర్వా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.

శర్వా చేసుకోబోయే రక్షిత ఎవరు?
శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు రక్షిత రెడ్డి. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఆమె తండ్రి పేరున్న లాయర్. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె ఈ రక్షిత అని తెలిసింది. అంతే కాదు... ఆమె మాజీ మంత్రి  బొజ్జల గోపాల కృష్ణ మనవరాలు కూడా!

Also Read 'ఆదిపురుష్' టీమ్ భయపడుతోందా? - ప్రభాస్ ఫ్యాన్స్‌లో భయం భయం!

వరుస సినిమాలతో బిజీ బిజీగా శర్వానంద్!
ఇప్పుడు శర్వానంద్ వరుస సినిమాలు చేస్తున్నారు. పెళ్ళికి ముందు ఆయన చేసిన 'ఒకే ఒక జీవితం' తెలుగు, తమిళ భాషల ప్రేక్షకులను మెప్పించింది. విమర్శల నుంచి ప్రశంసలు అందుకుంది. మంచి వసూళ్లు రాబట్టింది. 

ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమా చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఆ సినిమాలో కృతి శెట్టి కథానాయిక. ఆ సినిమా కాకుండా సితార సంస్థలో కూడా ఓ సినిమా అంగీకరించారని తెలిసింది. సోలో హీరోగా కాకుండా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి కూడా శ్వరానంద్ సిద్ధంగా ఉన్నారు. 

రవితేజతో శర్వా సినిమా!
రవితేజ, శర్వానంద్ ఓ మల్టీస్టారర్ సినిమా చేయనున్నారు. ఆ సినిమాను 'కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్ డైరెక్ట్  చేయనున్నారు. అందులో లెక్చరర్ పాత్రలో రవితేజ కనిపించనున్నట్లు తెలుస్తోంది. రవితేజకు శిష్యుడిగా స్టూడెంట్ పాత్రలో శర్వానంద్ కనిపిస్తారని సమాచారం. ప్రస్తుతం రవితేజ, శర్వా చేస్తున్న సినిమాలు కంప్లీట్ అయ్యాక ఆ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని టాక్. 

Also Read పూరి జగన్నాథ్ హర్టు - ఒక్క రూపాయి కూడా వెనక్కి ఇచ్చేది లేదట!

Published at : 17 May 2023 11:17 AM (IST) Tags: sharwanand Rakshita Reddy Sharwanand Wedding Date Jaipur Leela palace Sharwa Rakshita Marriage

సంబంధిత కథనాలు

శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్‌డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!

శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్‌డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ  బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Agent Settlement - Surender Reddy : 'లైగర్' రూటులో 'ఏజెంట్' డిస్ట్రిబ్యూటర్ - సురేందర్ రెడ్డి దిమ్మ తిరిగే రిప్లై!

Agent Settlement - Surender Reddy : 'లైగర్' రూటులో 'ఏజెంట్' డిస్ట్రిబ్యూటర్ - సురేందర్ రెడ్డి దిమ్మ తిరిగే రిప్లై!

Flautist Naveen Kumar: ఏఆర్ రెహ్మాన్ ఫ్లూటిస్ట్ నవీన్ కుమార్‌కి బైడెన్ ప్రశంసలు, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్‌తో సత్కారం

Flautist Naveen Kumar: ఏఆర్ రెహ్మాన్ ఫ్లూటిస్ట్ నవీన్ కుమార్‌కి బైడెన్ ప్రశంసలు, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్‌తో సత్కారం

Ashish Vidyarthi : కష్టం కలిగినా అబ్బాయికి విడాకుల గురించి చెప్పక తప్పలేదు- ఆశిష్ విద్యార్థి

Ashish Vidyarthi : కష్టం కలిగినా అబ్బాయికి విడాకుల గురించి చెప్పక తప్పలేదు-  ఆశిష్ విద్యార్థి

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?