Pathaan First Look: షారుఖ్ ఖాన్ 'పఠాన్' - తెలుగులోనూ వచ్చెన్, విడుదల తేదీ కూడా
Shah Rukh Khan - Pathaan Motion Poster: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ 'పఠాన్'. ఈ రోజు న్యూ లుక్ విడుదల చేశారు.
Shah Rukh Khan completes 30 years In Indian Film Industry: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి నేటితో 30 ఏళ్ళు (30 Years Of SRK). ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ 'పఠాన్'లో న్యూ లుక్ విడుదల చేశారు.
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న 'పఠాన్' హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు. అందుకని, తెలుగులోనూ పోస్టర్లు విడుదల చేశారు. అలాగే, ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయనున్నట్లు షారుఖ్ ఖాన్ తెలిపారు.
Also Read : సూపర్ హిట్ 'డీజే టిల్లు'కు సీక్వెల్, క్రేజీ అప్‌డేట్ ట్వీట్ చేసిన ప్రొడ్యూసర్
''30 ఏళ్ళు. ఇంకా లెక్క పెట్టడం లేదు. మీ ప్రేమ, అభిమానం కొలవలేనంత ఉంది'' అని షారుఖ్ పేర్కొన్నారు. 'పఠాన్' న్యూ లుక్‌లో ఆయన గన్ పట్టుకుని, యాక్షన్ అవతారంలో కనిపించారు. ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటిస్తున్నారు.
Also Read : 'సమ్మతమే' రివ్యూ: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?
View this post on Instagram
View this post on Instagram