By: ABP Desam | Updated at : 25 Jun 2022 02:48 PM (IST)
'డీజే టిల్లు'లో నేహా శెట్టి, సిద్ధూ జొన్నలగడ్డ
డీజే టిల్లు... ఇదొక సినిమా కాదు, క్యారెక్టర్ పేరు కూడా కాదు! ఒక ఎమోషన్! ఆల్మోస్ట్ అన్ని వయసుల ప్రేక్షకులు ఒక్కసారైనా టైటిల్ సాంగ్ విని ఉంటారు. చాలా మంది ఆ పాటకు స్టెప్పులు వేసి ఉంటారు. చాలా ఫంక్షన్స్‌లో ఆ సాంగ్ ప్లే చేశారు. తెలుగు సినిమా ప్రేక్షకులను 'డీజే టిల్లు' బాగా ఆకట్టుకున్నాడు. సిద్ధూ జొన్నలగడ్డకు స్టార్ స్టేటస్ తీసుకు వచ్చింది. అతడితో పాటు ఆ సినిమా ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్.
'డీజే టిల్లు'కు సీక్వెల్ ఉంటుందని ఆ సినిమా ఎండ్ కార్డ్స్‌లో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు 'డీజే టిల్లు' పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని నిర్మాణ సూర్యదేవర నాగవంశీ ట్వీట్ చేశారు. అయితే, ఆ ట్వీట్‌లో ఎక్కడా 'డీజే టిల్లు' అని చెప్పలేదు.
''ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్రాంచైజీ... రౌండ్ 2 కోసం రెడీ అవుతున్నాం. ఆగస్టు నుంచి క్రేజీ అడ్వెంచర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది'' అని సూర్యదేవర నాగవంశీ పేర్కొన్నారు.
Also Read : థియేటర్లలో పెద్ద చిత్రాలే విడుదల చేయాలా? - నిర్మాత ఎంఎస్ రాజు సంచలన వ్యాఖ్యలు
The most awaited Franchise... Gearing up for Round 2 🔥
— Naga Vamsi (@vamsi84) June 25, 2022
Crazy adventure starts filming in August! 🤩 pic.twitter.com/JX130Z4fpZ
Siddu Jonnalagadda as DJ Tillu, Will Be Back Very Soon: 'డీజే టిల్లు 2'లో కూడా సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తారు. కథ, మాటల్లో ఆయన పార్టిసిపేషన్ ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
'డీజే టిల్లు'లో నేహా శెట్టి కథానాయికగా నటించారు. మరి, రెండో సినిమాలో ఆమె ఉంటారా? లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సందర్భంగా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఆశిస్తున్నట్టు సిద్ధూ జొన్నలగడ్డకు దర్శక - నిర్మాత మధుర శ్రీధర్ కంగ్రాట్స్ చెప్పారు.
Also Read : 'సమ్మతమే' రివ్యూ: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?
Hearty congratulations brother 💐💐💐. Wish you a blockbuster with part - 2! @Siddu_buoy
— Sreedhar Reddy Komalla (@madhurasreedhar) June 25, 2022
Tejaswi Madivada Shocking Comments : అడల్ట్ కంటెంట్ చేయడంలో తప్పేముంది? - తేజస్వి షాకింగ్ కామెంట్స్
Boycott Vikram Vedha : ఆమిర్‌పై కోపం హృతిక్ రోషన్ మీదకు - ఒక్క ట్వీట్ ఎంత పని చేసిందో చూశారా?
Balakrishna Appreciates Bimbisara : బాబాయ్‌గా బాలకృష్ణ కోరిక అదే - దర్శకుడికి ఓపెన్ ఆఫర్
Karthikeya 2 Box Office Collection Day 1 : స్క్రీన్లు తక్కువ, కలెక్షన్లు ఎక్కువ - తొలి రోజే 25 శాతం రికవరీ చేసిన 'కార్తికేయ 2'.
Nandamuri Balakrishna : సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ?
Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు
మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!
Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!
pTron Tangent Duo: రూ.500లోపే వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!