By: ABP Desam | Updated at : 11 May 2023 10:26 AM (IST)
'శాకుంతలం'లో సమంత (Image Credit: Samantha /Twitter)
శకుంతల కథ ఏమిటి? హిందూ మైథాలజీ మీద అవగాహన ఉన్న మన దేశంలో ప్రజలకు ప్రత్యేకించి విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు. క్లుప్తంగా చెప్పాలి అంటే... విశ్వామిత్రుని తప్పస్సుకు ఆటంకం కలిగించాలని మేనకను ఇంద్రుడు భూలోకానికి పంపిస్తారు. తపస్సును భంగం చేసిన మేనక, ఆ క్రమంలో గర్భవతి అవుతుంది. బిడ్డను భూలోకంలో వదిలి స్వర్గానికి వెళుతుంది. తర్వాత ముని చేరదీసి పెంచుతారు. గంధర్వ వివాహం చేసుకున్న భర్త సైతం ఆమె ఎవరో గుర్తు లేదని చెప్పడంతో గర్భవతిగా ఉన్న సమయంలో మరోసారి అనాథ అవుతుంది.
పుట్టిన మరుక్షణమే శకుంతల అనాథ అయ్యింది. ఇప్పుడు మరోసారి ఆమెను 'శాకుంతలం' చిత్ర బృందం అనాథను చేసింది. శకుంతల, దుష్యంతుల కథతో గుణశేఖర్ తెరకెక్కించిన సినిమా 'శాకుంతలం' (Shaakuntalam Movie).
ఏప్రిల్ 14న 'శాకుంతలం' సినిమా థియేటర్లలోకి వచ్చింది. పాన్ ఇండియా రిలీజ్ చేశారు. దానికి రెండు మూడు రోజుల ముందు నుంచి ప్రీమియర్ షోలు వేశారు. అప్పటి నుంచి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఆడియన్స్ రియాక్షన్ కూడా అందుకు అతీతంగా ఏమీ లేదు. మెజారిటీ ప్రేక్షకులు అందరూ ఒక్కటే మాట చెప్పారు... సినిమా బాలేదని! ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చింది.
ఓటీటీలో వస్తే ఒక్కరూ ట్వీట్ చేయలేదు!
Shakuntalam OTT Release Platform : అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మే 11న 'శాకుంతలం' విడుదల అయ్యింది. మే 10... అనగా నిన్న అర్ధరాత్రి నుంచి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా అందుబాటులో ఉంది. ఫ్లాప్ సినిమా అనుకున్నారో? మరొకటో? ఓటీటీలో విడుదలైన విషయాన్ని చిత్ర బృందంలో ఒక్కరు కూడా ట్వీట్ చేయలేదు.
సాధారణంగా స్టార్స్ నటించిన సినిమాలు థియేటర్లలో విడుదలైనప్పుడు మాత్రమే కాదు... ఓటీటీ విడుదల సమయాల్లోనూ సోషల్ మీడియాలో హడావిడి మూమూలుగా ఉండదు. కానీ, 'శాకుంతలం' సినిమాకు అటువంటి హడావిడి ఏదీ లేదు. ఓటీటీలో విడుదల అయితే... సమంత సహా నిర్మాత నీలిమా గుణ, దర్శకుడు గుణశేఖర్, ఇతర యూనిట్ సభ్యులు ఎవరూ ట్వీట్ చేయలేదు. అనాథను వదిలేసినట్టు వదిలేశారు. విజయాలకు అందరూ చుట్టాలే, అపజయాలకు ఎవరూ తోడు ఉండరని సినిమా ఇండస్ట్రీలో ఇందుకే అంటుంటారు ఏమో!?
Also Read : ప్రేమలో ప్రభాస్ - అనుష్క తప్ప ఎవరూ సెట్ అవ్వరా? 'ఆదిపురుష్' ట్రైలర్ మీమ్స్ చూశారా?
ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సమర్పణలో డిఆర్‌పి (దిల్ రాజు ప్రొడక్షన్స్) - గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మించారు. సమంత (Samantha) టైటిల్ రోల్ చేయగా... ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ (Dev Mohan) నటించారు. 'శాకుంతలం' సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ప్రేమకథను అందంగా చెప్పడంలో గుణశేఖర్ ఫెయిల్ అయ్యారని చాలా మంది కామెంట్ చేశారు. ఓటీటీ ఆడియన్స్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.
దుర్వాస మహర్షిగా కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ప్రియంవద పాత్రలో అనన్యా నాగళ్ళ, అదితి బాలన్ పాత్రలో అనసూయ నటించారు. ప్రకాష్ రాజ్, గౌతమి, జిష్షుసేన్ గుప్తా, మధుబాల, కబీర్ బేడీ, సచిన్ ఖేడేకర్, వర్షిణి తదితరులు ఇతర తారాగణం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
Also Read : చేతకాని వాళ్ళు అదుపు తప్పారు, తిడితే వాళ్ళ నోరే కంపు అవుతుంది - అనసూయ ఫైర్
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్‌డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!
Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?
Agent Settlement - Surender Reddy : 'లైగర్' రూటులో 'ఏజెంట్' డిస్ట్రిబ్యూటర్ - సురేందర్ రెడ్డి దిమ్మ తిరిగే రిప్లై!
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
Couple Died With Heart Attack: గుండెపోటుతో నవదంపతుల మృతి, శోభనం గదిలో విగతజీవులుగా మారిన కొత్త జంట
Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్