Saripodhaa Sanivaaram Box Office Collection Day 1: సరిపోదా శనివారం బాక్సాఫీస్ రిపోర్ట్ - నాని సినిమా ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Saripodhaa Sanivaaram Collection Day 1: న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన 'సరిపోదా శనివారం' సినిమాకు ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ వచ్చాయి.

'సరిపోదా శనివారం' సినిమాకు ప్రీమియర్ షోస్ నుంచి మంచి టాక్ వచ్చింది. అటు అమెరికా, ఇటు ఇండియాలో ప్రేక్షకులు సినిమా బావుందని చెప్పారు. హీరో నాని, మరీ ముఖ్యంగా విలన్ రోల్ చేసిన ఎస్.జె. సూర్య నటనకు ఫిదా అయ్యారు. మరి, బాక్స్ ఆఫీస్ దగ్గర రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసా? ఈ సినిమా ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
సరిపోదా... ఇండియాలో 8.5 కోట్ల రూపాయల కలెక్షన్స్?
ఏపీ, తెలంగాణ... తెలుగు రాష్ట్రాల్లో 'సరిపోదా శనివారం' సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది. మార్నింగ్ షోస్ కంటే నైట్ షోస్ కలెక్షన్స్ బావున్నాయి. ఓవరాల్ ఫస్ట్ డే షేర్ చూస్తే... ఇండియాలో 'సరిపోదా శనివారం'కు రూ. 8.5 కోట్ల కలెక్షన్ లభించింది.
ఏపీ, నైజాంలో మొదటి రోజు 'సరిపోదా శనివారం' రూ. 6.50 కోట్ల వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల తర్వాత సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చింది కర్ణాటకలో. అక్కడ నుంచి కోటి రూపాయలు రాబట్టింది. తమిళనాడులోనూ సినిమాను భారీ ఎత్తున విడుదల చేశారు. పైగా, ఎస్.జె. సూర్య విలన్ రోల్ చేయడం వల్ల క్రేజ్ నెలకొంది. అయితే, ఈ సినిమా అక్కడ కేవలం రూ. 63 లక్షల రూపాయలు మాత్రమే రాబట్టింది. ఉత్తరాదిలో మినిమల్ రిలీజ్ ఉంటుందని న్యాచురల్ స్టార్ నాని ముందు నుంచి చెబుతున్నారు. నార్త్ ఇండియా నుంచి రూ. 7 లక్షల రూపాయలు వచ్చాయి.
Also Read: సరిపోదా శనివారం రివ్యూ: నాని మాస్ హీరోయిజం వర్సెస్ ఎస్.జె. సూర్య విలనిజం - సినిమా ఎలా ఉందంటే?
అమెరికాలో నానికి బిగ్గెస్ట్ ఓపెనింగ్ సరిపోదా!
ఓవర్సీస్ మార్కెట్ చూస్తే... అమెరికాలో నాని బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాగా 'సరిపోదా శనివారం' రికార్డు క్రియేట్ చేసింది. వీకెండ్ కాకుండా మిడ్ వీక్ రిలీజ్ అయినా సరే అక్కడ మొదటి రోజు 2,71,110 డాలర్లు కలెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ 300కె డాలర్స్ అంటే మామూలు విషయం కాదు. వీకెండ్ వచ్చేసరికి మిలియన్ డాలర్ క్లబ్బులో సినిమా చేరే అవకాశాలు ఉన్నాయి.
#SaripodhaaSanivaaram North America Day 1 Reported Hourly Gross (7pm pt): $271,110 from 401 Locations
— Venky Box Office (@Venky_BO) August 30, 2024
A near $300K Day 1 on a week day. Nani’s Biggest Day 1 excluding premieres. If trend holds up tomorrow then a big long weekend is on cards 👍🔥
'ఆర్ఆర్ఆర్' తర్వాత డీవీవీ మూవీస్ అధినేత డీవీవీ దానయ్య, ఆయన కుమారుడు కళ్యాణ్ దాసరి నిర్మించిన సినిమా 'సరిపోదా శనివారం'. అటు నిర్మాతలకు, ఇటు డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా లాభాలు తీసుకు వచ్చేలా ఉంది. ఇందులో ప్రియాంక మోహన్ కథానాయికగా నటించగా... అభిరామి, సాయి కుమార్ హీరో తల్లిదండ్రుల పాత్రల్లోనూ... మురళీ శర్మ, అజయ్, హర్షవర్ధన్, 'శుభలేఖ' సుధాకర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. జేక్స్ బిజాయ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

