అన్వేషించండి

Saripodhaa Sanivaaram: 100 కోట్ల క్లబ్‌లో 'సరిపోదా శనివారం' - నాని జైత్రయాత్రలో మరో భారీ బ్లాక్‌ బస్టర్

Saripodhaa Sanivaaram Collection: హీరో నాని 100 కోట్ల క్లబ్ లో మూడోసారి ఎంట్రీ ఇచ్చాడు. సరిపోదా శనివారం మూవీ వరల్డ్ వైడ్ గా 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.

'సరిపోదా శనివారం' జోరు కొనసాగుతోంది. కలెక్షన్ల విషయంలో ఈ మూవీ ఏమాత్రం సరిపెట్టుకునేలా లేదు. విడుదలైన రెండున్నర వారాల్లోనే వరల్డ్ వైడ్ రూ. 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. 'బాక్సాఫీస్ శివతాండవమే' అంటూ తమ సంతోషం వ్యక్తం చేసింది. తమ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసిందని ప్రకటించింది. 

నాని ఖాతాలో మూడో 100 కోట్ల సినిమా
నేచురల్ స్టార్ నాని ఖాతాలో చాలా హిట్లున్నాయి. అయితే ఆయన పాన్ ఇండియా వైపు వెళ్లకపోవడంతో సినిమా హిట్ అయినా కలెక్షన్లు మాత్రం రికార్డుల్లోకి ఎక్కేవి కావు. ఇటీవల మాస్ అవతార్ లో నాని కలెక్షన్ల లెక్కల్ని కూడా సరిచేస్తున్నారు. 'ఈగ' సినిమాతో నాని మొదటి సారి 100 కోట్ల క్లబ్బులో చేరారు. అయితే, ఆ సినిమాలో ఆయన పాత్ర తెరపై కనిపించేది కొంచెం సేపే. 'దసరా' మూవీతో రెండోసారి సెంచరీ కొట్టాడు నాని. ఇప్పుడు సరిపోదా శనివారం మూవీతో మూడో సెంచరీ పూర్తి చేశాడు. మూడు వారాల్లోపే ఈ క్రెడిట్ వచ్చింది కాబట్టి.. ఈ మూవీ మరిన్ని భారీ కలెక్షన్లు సాధించే అవకాశముందని అంచనాలున్నాయి. 

డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమా తెరకెక్కించాడు. 'అంటే సుందరానికీ' అనే మూవీ తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో వచ్చిన సెకండ్ మూవీ ఇది. ఫస్ట్ మూవీతో కాస్త నిరాశపరచినా, సెకండ్ మూవీతో ఆ లోటు భర్తీ చేశాడు, నానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు వివేక్. 

స్పెషల్ థ్యాంక్స్ టు 'సీఐ దయ'..
ఈ సినిమాలో దర్శకుడి తర్వాత హీరో నాని ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే అది సీఐ దయ క్యారెక్టర్లో నటించిన ఎస్.జె సూర్యకే. నిజంగా ఈ సినిమాతో ఎస్.జె.సూర్య ఆర్టిస్ట్ గా మరో మెట్టు పైకెదిగాడు. సీరియస్ పాత్రలో కూడా అక్కడక్కడ కామెడీ పండిస్తూ అదరగొట్టాడు. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకొచ్చిన ఆడియన్స్ కి హీరో నాని చెప్పిన డైలాగులు గుర్తుండకపోవచ్చేమో కానీ, సీఐ పాత్రలో సూర్య చెప్పిన డైలాగులు మాత్రం రిపీటెడ్ గా వినపడుతుంటాయి. ఇటీవల సోషల్ మీడియా మీమ్స్ లో కూడా సూర్యదే హవా.  'నన్నడుగుతాడేంటి సుధా.. '! అంటూ సూర్య చెప్పే డైలాగులే మీమ్స్ గా మారిపోయాయి. 

Also Read: నాని అన్న చెప్పింది నిజమైంది - అప్పుడు మా అన్నయ్య, ఇప్పుడు నేను - ఆనందర్‌ దేవరకొండ ఎమోషనల్‌

నాని స్టైల్ మార్చినట్టేనా..?
హీరో నాని అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఓ ఇమేజ్ ఉంది. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీస్తుంటాడనే పేరుంది. ఫైట్లు, ఛేజ్ లు నాని సినిమాల్లో పెద్దగా చూడం. కానీ దసరా మూవీతో రా అండ్ రస్టిక్ పర్ఫామెన్స్ తో ఇరగదీశాడు నాని. ఇప్పుడు సరిపోదా శనివారం అంటూ ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తో తన సత్తా చూపించాడు. యాక్షన్ మూవీస్ కి కూడా నాని బెస్ట్ ఆప్షన్ అమే ఇమేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఓటీటీల ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో.. ఆడియన్స్ ని థియేటర్ల వరకు రప్పించాలంటే కచ్చితంగా మాస్ ఎలిమెంట్స్ ఉండాలి. సరిగ్గా ఇప్పుడు నాని ఆ ట్రెండ్ వెంట వెళ్తున్నాడు. మాస్ ఆడియన్స్ పల్స్ పట్టాడు, తన ఫ్యామిలీ ఇమేజ్ కి యాక్షన్ ఇమేజ్ ని కూడా జత చేశాడు. వరస హిట్లు కొడుతున్నాడు. 

Also Read: పెళ్లి పీటలు ఎక్కిన హీరోయిన్‌ మేఘా ఆకాష్‌ - హాజరైన సీఎం స్టాలిన్, ఫోటోలు వైరల్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget