అన్వేషించండి

Sankranthiki Vasthunnam First Look: సంక్రాంతికి వస్తున్నాం... ఫస్ట్ లుక్కే కాదు, రిలీజ్ అప్డేట్ కూడా ఇచ్చిన వెంకటేష్

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ 'సంక్రాంతి వస్తున్నాం'. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను దీపావళి సందర్భంగా నేడు రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజ్ డేట్ కూడా చెప్పారు.

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ 'సంక్రాంతి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam). ఈ మూవీ ఫస్ట్ లుక్ ను దీపావళి సందర్భంగా నేడు రిలీజ్ చేశారు మేకర్స్. కేవలం ఫస్ట్ లుక్ ను మాత్రమే కాకుండా పనిలో పనిగా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు.

ఈ ఏడాది సంక్రాంతికి 'సైంధవ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు వెంకీ మామ. అది అంతగా ఆడలేదు. దాంతో తనకు బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్లో ప్రేక్షకులను అలకరించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తునట్టు చెప్పారు.

Also Read: 'సింగం ఎగైన్' రివ్యూ: ఇది రోహిత్ శెట్టి తీసిన రామాయణం... సినిమాగా ఎలా ఉందంటే?

విక్టరీ వెంకటేష్, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న తాజా చిత్రానికి 'సంక్రాంతికి వస్తున్నాం' టైటిల్ ఖరారు చేసినట్టు వెల్లడించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఎఫ్2, ఎఫ్ 3 వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు వచ్చాయి. అందులో 'ఎఫ్ 2' మూవీ వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డును గమనిస్తే ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ అని చెప్పొచ్చు. తాజాగా ఈ డైనమిక్ కాంబోలో వస్తున్న మూడవ సినిమా గురించి మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

'సంక్రాంతికి వస్తున్నాం' పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాగా, ఇదొక ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ గా తెరకెక్కుతోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ జోడీగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లో పోస్టర్ ను రిలీజ్ చేశారు.

"సంక్రాంతికి వస్తున్నాం" అనే టైటిల్ తో మూవీని కూడా సంక్రాంతి టైంలోనే రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఇంకా రిలీజ్ డేట్ ను అయితే ప్రకటించలేదు కానీ పోస్టర్ లో 2025 సంక్రాంతికి మూవీ రిలీజ్ ఉంటుందని అప్డేట్ ఇచ్చారు. ఇక ఆ పోస్టర్లో సంక్రాంతికి తగ్గట్టుగానే టైటిల్ ను ముగ్గులు, తుపాకీలతో ఇంట్రెస్టింగా డిజైన్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లో వెంకటేష్ లుంగీ ధరించి గంభీరంగా కనిపిస్తుండగా, కళ్ళకు స్టైలిష్ షేడ్స్, చేతిలో తుపాకీ పట్టుకొని ఉండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇక సినిమాలో ఆయన ఆన్ స్క్రీన్ భార్య ఐశ్వర్య రాజేష్ సంప్రదాయ లుక్ లో కనిపిస్తుంటే, మాజీ ప్రేయసి మీనాక్షి చౌదరి స్టైలిష్ అవతార్ లో ఆకట్టుకుంటుంది. 

Also Read: దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి సెలబ్రేషన్స్ - డైరెక్ట్‌గా చెప్పిన నేషనల్ క్రష్


'సంక్రాంతికి వస్తున్నాం' పోస్టర్ బ్యాగ్రౌండ్ లో కొన్ని ముఖ్యమైన తేదీలు, వార్తా పత్రికల క్లిప్పింగులతో నిండిన పరిశోధనాత్మకమైన క్రైమ్ బోర్డు కనిపించడం చూస్తుంటే సినిమాపై క్యురియాసిటీ పెరిగిపోతోంది. మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీపై మంచి బజ్ పెరిగేలా చేశారు. పోస్టర్ డిజైన్ లో అనిల్ రావిపూడి మార్క్ చూపించారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతుండగా సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Best Budget CNG Cars: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Embed widget