NASA Says Mars Rover Discovered Potential Biosignature | అంగారకుడిపై జీవం నిజమే | ABP Desam
భూమి మీద కాకుండా మరెక్కడ జీవం ఉండేందుకు ఆస్కారం ఉందా అన్న ప్రశ్న కొన్ని వందల ఏళ్లుగా శాస్త్రవేత్తలకు కంటి మీద కునుకు పడనీయటం లేదు. బుద్ధి జీవులుగా మనుషులు కోట్లాది ప్రాణులతో కలిసి భూమిపై బతుకుంటే ఇలాంటి జీవ ప్రపంచం ఈ విశాలమైన విశ్వంలో ఇంక ఎక్కడైనా ఉందా తెలుసుకోవాలన్న కుతూహలం, ముంచుకొస్తున్న భవిష్యత్తు అవసరాలు మన సైంటిస్టులను రకరకాల ప్రయోగాలు చేసేలా చేస్తున్నాయి. అలాంటి ప్రయోగాల్లో కొన్ని ఖగోళ శాస్త్రవేత్తల ఆందోళనలను కొంచెం తగ్గించి అవును భూమిపైనే కాకుండా జీవం ఉండేందుకు ఆస్కారం ఉందని నిరూపిస్తున్నాయి. తాజాగా నాసా పరిశోధనల్లో అలాంటి ఓ సంచలన విషయమే వెలుగు చూసింది. అయితే అది మరెక్కొడో కాదు. భూమి లాంటి వాతావరణ పరిస్థితులను పోలి ఉండే మన మార్స్ పైనే. ఏంటా పరిశోధన..శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచేలా వచ్చిన ఆ ఫలితాలు ఏంటీ ఈ వారం అంతరిక్ష కథల్లో మాట్లాడుకుందాం..
మనుషుల్లా కాకపోయినా కనీసం ఎలా ఉంటాయో మనకు తెలియని అర్థం కాని ఏలియన్స్ లా ఏదో గ్రహంపై జీవం ఉండొచ్చని శాస్త్రవేత్తలు వేస్తున్న అంచనాలు..విశ్వాన్ని జల్లెడ పట్టేందుకు చేస్తున్న ప్రయోగాల్లో ఓ గొప్ప పురోగతి దిశగా సాగుతున్నాయని నిరూపించేలా ఇటీవల ఓ ఘటన జరిగింది. పర్ సివరెన్స్ అని నాసా మార్స్ మీదకు పంపించిన ఓ రోవర్ ఓ అద్భుతమైన విషయాన్ని కనిపెట్టింది. 2021 నుంచి మార్స్ మీదే తిరుగుతూ అక్కడి వాతావరణ పరిస్థితులు కొన్ని వేల ఏళ్ల నాటి రాళ్లు రప్పలపై పరిశోధనలు చేస్తూ వెళ్తోంది. మార్స్ మీద జెజెరో క్రేటర్ అని పిలిచుకునే చోట ఈ రోవర్ ల్యాండ్ అయ్యేలా చేశారు నాసా సైంటిస్టులు. దీనికి ఈ రీజన్ ఈ జెజెరో క్రేటర్ అని ప్రాంతమంతా ఒకప్పుడు అంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం ఓ పెద్ద సముద్రం లాంటిది ఉండేదని సైంటిస్టులు భావిస్తుంటారు. ఇదే నిజమే అనిపించేలా ఇప్పటికి అక్కడి రాళ్లు అక్కడ గుర్తులన్నీ ఏదో వాటర్ ఫ్లో అయినట్లుగానే ఉన్నాయి. ఇప్పుడైతే వాటర్ లేదు కానీ నాసా పర్ సివరెన్స్ చేస్తున్న ప్రయోగాలతో ఎస్ శాస్త్రవేత్తల అంచనా నిజం అని ప్రూవ్ అవుతోంది.
మొత్తం ఈ పరిశోధనల కోసం రోవర్ ను అక్కడ పంపించటానికి నాసా దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ రోవర్ 2021 నుంచి పనిచేస్తున్నా గతేడాది నుంచి మాత్రం విస్తృతంగా శాంపుల్ కలెక్షన్ చేస్తోంది. అలా జెజెరో క్రేటర్ మీద చేయావా ఫాల్స్ అని పిలుచుకునే చోట సాఫైర్ కేన్యాన్ ఓ పాత నదీ ప్రవాహపు లోయ లాంటిది ఉంటే అక్కడ శాంపుల్స్ తవ్వింది మన నాసా పర్ సివరెన్స్ రోవర్. ఈ రోవర్ కి ఉండే రాళ్లను ఎక్స్ రే తీసే మిషన్ ఆధారంగా, ఇంకా జీవపదార్థం ఏమైనా ఉందా అని డిటెక్ట్ చేసే షెర్లాక్ అనే ఇన్ స్ట్రుమెంట్స్ ఆధారంగా తను సేకరించిన శాంపుల్స్ ను క్లోజ్ గా స్టడీ చేసింది. ఆ డేటాను నాసా ఆధ్వర్యంలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీకి పంపించటం ద్వారా ఇక్కడి శాస్త్రవేత్తలు కూడా రోవర్ కలెక్ట్ చేసిన శాంపుల్ పై పరిశోధనలు చేసి సంచలన విషయాలను వెల్లడించారు.
రోవర్ సేకరించిన రాళ్లలో ఆర్గానిక్ కార్బన్, సల్ఫర్, ఫాస్ఫరస్, ఐరన్ కు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని తేలింది. మన భూమి మీద జీవం ఏర్పడటానికి కారణమైన వాటిలో ఇవి చాలా కీలకమైనవి. మరి అచ్చం ఇలాంటివే మార్స్ మీద కనపడేసరికి సైంటిస్టుల పరిశోధనలు కీలక పురోగతి సాధించాయని చెప్పాలి. అంతే కాదు ఈ రాళ్ల పైన లెపార్డ్ స్పాట్స్ కూడా ఉన్నాయంట. అంటే చిరుత పులి శరీరంపై ఎలా అయితే మచ్చలు ఉంటాయో అలాంటి మచ్చలే అంగారకుడిపై నాసా రోవర్ సేకరించిన రాళ్లపైన కూడా ఉన్నాయటం. ఈ మచ్చలు ఉన్నాయంటే అర్థం ఆ రాళ్లలో వివియనైట్, గ్రెగైట్ అనే రెండు అరుదైన మినరల్స్ ఉన్నాయని అర్థం. అచ్చం ఈ రెండు అరుదన మినరల్సే భూమి పై జీవం ఏర్పడటానికి కారణమయ్యాయి. పైగా ఈ రాళ్లు ఇప్పటి వరకూ మార్స్ మీద సైంటిస్టులు గమనించిన అతి తక్కువ వయస్సున్న రాళ్లు. అంటే ఆ జీవం ఏర్పడింది కూడా ఈ మధ్య కాలంలోనే అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే అనుకోవచ్చు. అయితే ఈ మినరల్స్ ప్రాణం లేకపోయినా కూడా ఏర్పడతాయి కానీ అక్కడ అత్యంత వేడి ఉష్ణోగ్రత, యాసిడ్స్ ఉంటే ఏర్పడొచ్చు. కానీ మార్స్ మీద అలాంటి యాసిడ్స్ ఆనవాళ్లే లేవు. నాలుగేళ్లుగా మన రోవర్ హ్యాపీగా భూమి మీద తిరిగినట్లే అక్కడ తిరిగేస్తూ పరిశోధనలు చేస్తోంది. సో ఇవి ఒకప్పుడు మార్స్ పైన ఉన్న జీవం తాలుకూ మినరల్స్ అని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు.
మార్స్ పై కన్ఫర్మ్ గా జీవం ఉందని ధ్రువీకరించట్లేదు కానీ ఇప్పటి వరకూ దొరికిన ఆధారాలన్నీ మార్స్ పై ఒకప్పుడు భూమిపైన ఉన్నట్లు మహాసముద్రాలు, ఆ సముద్రాల్లో జీవం, గ్రహాంతర జీవులు కూడా ఉండి ఉండొచ్చని..ఏదో ఘోర విపత్తు కారణంగానో మరేదో రీజన్ తో ఇప్పుడు అంగారక గ్రహం ఇలా నిర్జీవంగా మారిపోయి ఉంటుందనీ..కానీ అక్కడున్న పరిస్థితులు ఏంటనే అంచనాకు వస్తే భవిష్యత్తులో భూమి ఒక్కటే కాకుండా మార్స్ ను కూడా మనిషి తన ఆవాసంగా మార్చుకునే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయొచ్చని సైంటిస్టుల అంచనాలకు, ఊహలకు ఇప్పుడు పర్ సివర్సెన్ రోవర్ సేకరించిన ఆధారాలు ప్రాణం పోసినట్లైంది.





















