Telangana Congress Risk: రేవంత్ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ - కాలేజీలకు తోడుగా ఆస్పత్రులు - ఆరోగ్యశ్రీబంద్ !
Telangana Hospitals: బిల్లులు బకాయిలు పెట్టడంతో ఆరోగ్యశ్రీ చికిత్సలు ఆపేయాలని తెలంగాణ ఆస్పత్రులు నిర్ణయించాయి. ఇప్పటికే ఇంజినీరింగ్ కాలేజీలు బంద్ పాటిస్తున్నాయి.

Telangana Arogyasri treatments Stop: తెలంగాణ ప్రభుత్వాన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. బిల్లుల బకాయిలు పేరుకుపోతూండటంతో అందరూ.. తమ సేవల్ని నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ వంటి ఉన్నత విద్యా సంస్థలు నిరవధిక బంద్ ప్రారంభించాయి. అదే సమయంలో, ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేట్ ఆస్పత్రులు తమకూ బకాయిలు పెరిగిపోయాయని తాము కూడా సేవల్ని నిలిపివేస్తామని ప్రకటించారు.
ఫీజు రీఎంబర్స్‌మెంట్ రాలేదని కాలేజీల బంద్
తెలంగాణలోని ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, నర్సింగ్ కాలేజీలు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ. 8,000 కోట్లు వరకూ పెడింగ్ ఉన్నాయి. వీటిని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాలేజీలు నిరవధిక బంద్ పాటిస్తున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్స్ , ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల ఫెడరేషన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి.
ఆస్పత్రుల బకాయిల కోసం ఆరోగ్యశ్రీ సేవలు బంద్
ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించినా ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు విడుదల చేయకపోవడం, స్కాలర్‌షిప్‌లు ఆలస్యం కావడం వల్ల కాలేజీలు జీతాలు, ఇతర ఖర్చులు చెల్లించలేకపోతున్నాయి. తెలంగాణ వ్యాప్తం 12 లక్షల మంది విద్యార్థులు క్లాసులు జరగకపోవడం వల్ల కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొ చర్చలు జరిగినా ఫలితం లేకపోవడంతో యాజమాన్యాలు బంద్‌కు వెళ్లాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమస్యలపై మంత్రులతో సీఎం రేవంత్ చర్చలు జరిపారు. కాలేజీలకో ఎంతో కొంత నిధులు సర్దుబాటు చేస్తేనే వారు కాలేజీలు మళ్లీ ప్రారంభించే అవకాశం ఉది.
ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం
అదే సమయంలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులు మంగళవారం నుంచి సేవలను ఆపేస్తామని ప్రకటించింది. ప్రభుత్వం రూ. 1400 కోట్ల వరకూ బకాయి ఉందని .. వాటిని చెల్లించకపోవడం, ప్యాకేజీ రేట్లు రివైజ్ చేయకపోవడం, MoUలు మార్చకపోవడం వల్ల ఆస్పత్రులకు సమస్యలు వస్తున్నాయి. . చిన్న, మధ్యస్థ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ రోగులపై 75-85 శాతం ఆధారపడి ఉంటాయి, డబ్బులు రాకపోతే మూసివేయాల్సి వస్తుందని అంటున్నారు.
ఆర్థిక సమస్యల్లో ఉన్నా తెలంగాణ ప్రభుత్వం
అటు కాలేజీలు సమ్మెలోకి వెళ్లాయి.. ఇటు ఆరోగ్యశ్రీ బకాయిల కోసం ఆస్పత్రులూ అదే దారిలో ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడం తెలంగాణ ప్రభుత్వానికి అత్యవసరంగా మారింది. ఈ రెండు సమస్యలు సామాన్య ప్రజలను ప్రభావితం చేసేవే. సాధారణంగా ప్రభుత్వాలు.. ఈ రంగాల్లో ప్రభుత్వం తరపున ప్రజలకు ఉచిత సేవలు అందిస్తున్న అంశంలో కొన్ని బకాయిలు ఉంటూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు ఎంతో కొంత చెల్లిస్తూ ఉంటాయి ప్రభుత్వాలు. అవి కూడా చెల్లించకపోవడం.. బకాయిలు పెరిగిపోతూడంటంతో.. ఆయా కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ కూడా రిస్క్ లో పడుతోంది. అందుకే సమ్మె ఆలోచనలు చేస్తున్నారు.





















