Katrina Kaif: బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ తల్లి కాబోతున్నారా? - వచ్చే నెలలోనే గుడ్ న్యూస్ చెప్పనున్న కపుల్!
Katrina Kaif Pregnancy Rumours: బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ రూమర్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి. కత్రినా విక్కీ కపుల్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు ప్రచారం సాగుతోంది.

Bollywood Actress Katrina Kaif Pregnancy Rumours Gone Viral: బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెంట్ అవుతోంది. 2021లో తన కంటే వయసులో చిన్న వాడైన విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకున్నారు కత్రినా. త్వరలోనే ఈ కపుల్ గుడ్ న్యూస్ చెప్పనున్నారనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వచ్చే నెలలో గుడ్ న్యూస్!
కత్రినా గర్భంతో ఉన్నారంటూ గతంలోనూ పలు కథనాలు ప్రచారం అయ్యాయి. దీనిపై కత్రినా రియాక్ట్ కాకపోయినా విక్కీ రియాక్ట్ అయ్యారు. అలాంటిదేమీ లేదని... ఏదైనా ఉంటే తామే స్వయంగా చెబుతామంటూ అప్పట్లో ఆ రూమర్స్‌కు చెక్ పెట్టారు. తాజాగా మరోసారి కత్రినా గర్భంతో ఉన్నారంటూ నెట్టింట ప్రచారం సాగుతోంది. అక్టోబరులో లేదా నవంబర్‌లో ఆమె అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు ఆంగ్ల మీడియాల్లోనూ పలు కథనాలు వచ్చాయి.
కత్రినా ప్రస్తుతం మూవీస్‌కు గ్యాప్ తీసుకున్నారని... ప్రసవం తర్వాత కూడా చాలా గ్యాప్ తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, వీటిపై ఇప్పటివరకూ కత్రినా విక్కీ కపుల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. 2 నెలల క్రితం కత్రినా ఓవర్ సైజ్ షర్ట్‌లో కనిపించడంతో రూమర్స్ హల్చల్ చేయగా ప్రస్తుతం ఆ పాత వీడియో ట్రెండ్ అవుతోంది. ఈ వార్తలు నిజమా? కాదా? అనేది స్వయంగా కత్రినా విక్కీ రియాక్ట్ అయితే తప్ప క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు.
Also Read: 'OG' నుంచి 'గన్స్ అండ్ రోజెస్' సాంగ్ వచ్చేసింది - 'హంగ్రీ చీతా'తో మరోసారి మోత మోగించేసిన తమన్
ఇక సినిమాల విషయానికొస్తే... కత్రినా లాస్ట్‌గా విజయ్ సేతుపతితో 'మేరీ క్రిస్మస్' మూవీలో నటించారు. ఈ ఏడాది 'ఛావా'తో సూపర్ హిట్ అందుకున్న విక్కీ కౌశల్. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. విక్కీ ప్రస్తుతం రణబీర్ కపూర్, ఆలియా భట్‌తో కలిసి 'లవ్ అండ్ వార్' మూవీలో నటిస్తున్నారు.






















