అన్వేషించండి

AP Liquor Scam Update: చెవిరెడ్డి టీమ్‌పై మరో చార్జిషీట్ - ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్ మరో ముందడుగు

Chevireddy: ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో చార్జిషీట్‌ను సిట్ దాఖలు చేసింది. లిక్కర్ స్కామ్ డబ్బుల్ని చెవిరెడ్డి .. ఆయన టీమ్ ఎలా లాండరింగ్ చేసిందో ఇందులో వివరించినట్లుగా తెలుస్తోంది.

SIT files another chargesheet in AP liquor scam:   ఏపీ మద్యం కుంభకోణ కేసులో సిట్ 86 పేజీల మూడో అదనపు చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ లు లిక్కర్ స్కామ్‌లో కీలకంగా ఎలా వ్యవహరించారో ఇందులో వివరించినట్లుగా తెలుస్ోతంది.  ముఖ్యంగా మద్యం ముడుపుల రవాణా, పంపిణీ ,  సంబంధిత అక్రమ కార్యకలాపాల గురించి వివరాలను ఈ చార్జిషీట్‌లో పొందు పరిచారు. ఇది కేసు దర్యాప్తులో మరో ముందడుగుగా భావిస్తున్నారు. 

జూలై 19, 2025న 300 పేజీల ప్రాథమిక చార్జ్‌షీట్‌ను సిట్ దాఖలు చేసింది. ఆగస్టు 11, 2025న 200 పేజీల రెండో చార్జ్‌షీట్,  ఇప్పుడు 86 పేజీల మూడో అదనపు చార్జ్‌షీట్ కోర్టులో నమోదు చేసింది.  ఈ చార్జ్‌షీట్‌లో మద్యం ముడుపుల రవాణాలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని, అతని సహాయంతో వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ ముడుపులను అక్రమంగా తీసుకొచ్చి పంపిణీ చేశారని పేర్కొంది. ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఏపీ సరిహద్దులకు రూ.8.20 కోట్ల నగదును బాలాజీ తీసుకొచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.  చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మద్యం సిండికేట్‌లో ముడుపుల సేకరణ, దాచిపెట్టడం, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడంలో పాలుపంచుకున్నారని, అతని పీఏలు నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ ఈ ప్రక్రియలో సహకరించారని సిట్ వెల్లడించింది. వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి మిత్రుడిగా ఈ కార్యకలాపాల్లో ముఖ్య పాత్ర పోషించారని సిట్ తేల్చింది.                       

ఈ నలుగురిలో పరారీలో ఉన్న ఇద్దర్ని ఇండోర్‌లో సిట్ అధికారులు అరెస్టు చేశారు. చెవిరెడ్డి , వెంకటేష్ నాయుడ్ని శ్రీలంకకు వెళ్తూండగా బెంగళూరులో అరెస్టు చేశారు.  ఈ కేసులో మొత్తం కేసులో 19 సంస్థలు, 29 మంది వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. ఇప్పటికి ఈ కేసులో  సిట్ దర్యాప్తులో 268 మంది సాక్షులను విచారించగా, రూ.62 కోట్లు సీజ్ చేశారు.   ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, ఎలక్ట్రానిక్ పరికరాల డేటా, కాల్ రికార్డులు, గూగుల్ టేక్‌అవుట్ సమాచారం వంటి ఆధారాలు చార్జ్‌షీట్‌లో సాక్ష్యాలుగా ప్రవేశ పెట్టారు.                 

గత రెండు వారాలుగా సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందిన కంపెనీల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న సునీల్ రెడ్డి  కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. చెవిరెడ్డి..కంపెనీల్లో లభించిన ఆధారాలను సమర్పించారు. లిక్కర్ కేసు   రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించినదని సిట్ చెబుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు గతంలో చార్జిషీట్‌లో పేర్కొన్నారు. మరో వైపు తనను అరెస్టు చేసి 90 రోజులు దాటిందని.. డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.                          

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బహిరంగ విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
బహిరంగ విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget