India vs Pakistan | Operation Sindoor | ఇంటర్నేషనల్ లెవెల్ లో పాక్ పరువు తీసేలా మాస్టర్ ప్లాన్
ఆసియా కప్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. పహాల్గమ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ వంటివి జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన తోలి మ్యాచ్ ఇది. పాకిస్తాన్ తో టీమ్ ఇండియా ఆడొద్దని ఈ మ్యాచ్ కంటే ముందు చాలా డిస్కషన్స్ జరిగాయి. ఫ్యాన్స్ కూడా ఈ గేమ్ కు వ్యతిరేకంగానే ఉన్నారు. కానీ ఫ్యాన్స్ ను ఏ మాత్రం డిస్సపాయింట్ చేయకుండా టీమ్ ఇండియా పాకిస్తాన్ కు చాలా ఘాటుగా సమాధానం ఇచ్చింది. మ్యాచ్ గెలిచిన తర్వాత భారత ఆటగాళ్లు అందరు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపొయ్యారు. అటు ప్లేయర్స్.. ఇటు సపోర్ట్ స్టాఫ్ ఎవరు కూడా బయటకు రాలేదు. పాకిస్తాన్ ప్లేయర్స్ కు ... ఫార్మిలీటీకి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాగే ఈ విజయాన్ని సైన్యానికి అంకితం ఇస్తున్నామని చెప్పాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. భారత ప్లేయర్లు.. పాక్ ప్లేయర్స్ కు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనేది ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై ప్రెస్ కాన్ఫరెన్స్ లో కెప్టెన్ సూర్యకుమార్ స్పందించారు.
జీవితంలో కొన్ని విషయాలు స్పోర్ట్స్ మ్యాన్ షిప్ కు ముందు ఉంటాయి అని అన్నాడు. ఈ విజయం ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న ఆర్మ్డ్ ఫోర్సెస్ కు అంకితం ఇస్తున్నాము అని చెప్పాడు. అయితే షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై మాట్లాడుతూ.. గవర్నమెంట్, బీసీసీఐ... మేము కలిసే ఉన్నాం. మేము ఇక్కడికి వచ్చాము, ఒక నిర్ణయం తీసుకున్నాము. మా ఆటతోనే వారికి సరైన సమాధానం ఇచ్చామని అన్నాడు.
నిజానికి పహాల్గమ్ ఎటాక్, ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ప్రతిఒక్కరు నివాళి అర్పించారు. ఇండియన్ క్రికెట్ టీమ్ ఏదైనా చేయాలి అనుకుంటే అందుకు సరైన సమాధానం పాకిస్తాన్ ను ఓడించడం. ఇప్పుడు టీమ్ ఇండియా కూడా అదే చేసింది. క్రికెట్ లో ఇండియా తన ప్రత్యర్థి టీమ్ కు షాక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనేది చాలా పెద్ద విషయం. ఒక్కసారిగా ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ మ్యాచ్ వైపు చూసింది. దాంతో పహాల్గమ్ ఉగ్రదాడి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ఒక మ్యాచ్ తో ఇంటెర్నేషన్ లెవెల్ లో పాకిస్తాన్ పరువు పోయింది అనే చెప్పాలి. తన స్టైల్ లో ఇండియన్ క్రికెట్ టీమ్ దొరికిన ఛాన్స్ ను ఉపయోగించుకొని పాకిస్తాన్ కు సరిగా సమాధానం చెప్తూ.. దేశభక్తిని చాటుకుంది.



















