Dasara Holidays In Andhra Pradesh: దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, విద్యార్థులకు పండగే
Dussehra holidays In Andhra Pradesh | అతిపెద్ద పండుగల్లో ఒకటైన దసరా సందర్భంగా ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. మొత్తం 9 రోజులపాటు విద్యార్థులకు సెలవులు ప్రకటించారు.

Dasara Holidays for Schools | అమరావతి : అమరావతి: రాష్ట్రంలో దసరా పండుగను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దసరా సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉండనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 9 రోజుల పాటు విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 3వ తేదీన పాఠశాలలు మళ్లీ ప్రారంభం కానున్నాయి.
ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం దసరా సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తుంది. దాంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సెలవులను కుటుంబంతో గడిపే అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు తమ సొంతూళ్లకు వెళ్తారు. పాఠశాలలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సెలవుల షెడ్యూల్‌ను గమనించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల
ఏపీ మెగా డీఎస్సీ పోస్టుల సెలక్షన్ జాబితాను పాఠశాల విద్యాశాఖ సోమవారం నాడు విడుదల చేసింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత టీచర్ల భర్తీ కోసం చేయాల్సిన డీఎస్సీ ఫైలుపై చేసిన తొలి సంతకం చేశారు. ఆ హామీ నేడు నెరవేరిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. కేవలం 150 రోజుల్లో డీఎస్సీ నియామక ప్రక్రియను చేపట్టి విజయవంతంగా పూర్తి చేసిన అందరికీ మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. సెలక్షన్ లిస్ట్ లింక్ ఇదే
ఏపీ ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా DSC-2025 నియామక ప్రక్రియను పూర్తి చేసింది. 2024 జూన్ 13వ తేదీన జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు నంబర్ 27తో డీఎస్సీ ప్రక్రియ మొదలైంది. కూటమి ప్రభుత్వం అక్టోబర్ 2024లో రెండవసారి టెట్ పరీక్ష నిర్వహించి డీఎస్సీలో మరికొంందరికి అవకాశం కల్పించింది. 100కు పైన కేసులు పెట్టినా విమర్శలకు తావు లేకుండా DSCని నిర్వహించామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు. కేవలం 150 రోజుల్లో డీఎస్సీ నిర్వహించి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేశామని వివరించారు. తొలిసారి హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశారు. 15,941 అభ్యర్థులతో ఫైనల్ సెలెక్షన్ లిస్టు రూపొందించగా.. పలు కమ్యూనిటీలలో అర్హులైన అభ్యర్థులు లేని కారణంగా 406 పోస్టులు భర్తీ చేయలేదని తెలిపారు.






















