Mizoram Lifestyle Exploring Telugu Vlog | మిజోరం లైఫ్ స్టైల్ ఒక్కరోజులో చూసేద్దాం రండి.! | ABP Desam
ఈశాన్య దిక్కున కొండల్లో ఉన్న చిన్న రాష్ట్రం మిజోరంకు తొలిసారి రైల్వే లైన్ వచ్చింది. దానితో అక్కడి టూరిజం గురించి.. జీవన పద్ధతుల గురించి నెట్లో చర్చ మొదలైంది. భారతదేశంలో ఇప్పటికీ మాతృ స్వామ్య వ్యవస్థ ఉన్న రాష్ట్రం మిజోరం. అక్కడి వ్యాపారాలు కుటుంబాలు మొత్తం ఆడవాళ్ళ చేతిలోనే నడుస్తాయి. స్వచ్చంద మద్యపాన నిషేధం అమల్లో ఉంది. వచ్చే పర్యాటకులు అసలు ఏ మాత్రం ఇబ్బంది పడరు. కారణం మిజోరం లో ఇంగ్లీష్ ప్రధాని భాష. అంతే కాదు అక్కడి ప్రజలు, అధికారులు పరిశుభ్రతకు చాలా పెద్దపీట వేస్తారు. పర్యావరణానికి మేలు చేసేలా అక్కడి అధికారుల చర్యలు, ప్రజల జీవన విధానం ఉంటుంది. తమ రాష్ట్రానికి వచ్చే టూరిస్టులతో స్థానికులు చాలా అంటే చాలా మర్యాదగా నడుచుకుంటారు. సహజ సిద్ధమైన లోయలకు నెలవైన, ప్రకృతి రమణీయతకు ముగ్ధమనోోహరమైన అందాలకు పెట్టింది పేరైన మిజోరం రాష్ట్రంలోని మరిన్ని విశేషాలు ఈ వ్లాగ్ వీడియోలో చూసేద్దామా





















