Spirit Update : 'స్పిరిట్' షూటింగ్ డేట్‌పై క్రేజీ అప్డేట్... ప్రభాస్ అభిమానులకు పూనకాలు తెప్పించే బ్లాస్టింగ్ న్యూస్
Spirit Update : ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న 'స్పిరిట్' మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది ? అనే అప్డేట్‌తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగ లాంటి మరో న్యూస్ కూడా బయటకు వచ్చింది.

Prabhas Spirit Movie Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ నెలలో స్టార్ట్ కాబోతోంది. అలాగే ఈ మూవీ ప్రభాస్ ఓన్‌గా స్టంట్స్ చేయబోతున్నారు.
'స్పిరిట్' షూటింగ్ అప్డేట్
'యానిమల్' సినిమాతో చారిత్రాత్మక విజయం అందుకున్న తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీని ప్రభాస్‌తో ప్రకటించారు. రెబల్ స్టార్‌తో కాప్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పిరిట్' సినిమా చేయబోతున్నారు. స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా అప్డేట్ గురించి చాలాకాలంగా ప్రభాస్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతోంది. మరోవైపు 'స్పిరిట్' సినిమా కోసం నటీనటుల సెలక్షన్ జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా అక్టోబర్ నెలలో 'స్పిరిట్' సినిమాను ప్రారంభించాలని చూస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.
సమాచారం ప్రకారం 'స్పిరిట్' సినిమా స్క్రిప్ట్ రాయడానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టిందని తెలుస్తోంది. ఎందుకంటే 'స్పిరిట్' సాధారణ పోలీసు థ్రిల్లర్ కాదు, ఈ మూవీతో వంగా కాప్ డ్రామాలలోనే ఒక కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేయబోతున్నట్టు సమాచారం. కథను స్క్రీన్‌ప్లేగా డెవలప్ చేయడానికి ఆయన 6 నెలలకు పైగా టైమ్ స్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి ప్రభాస్‌తో కలిసి 'స్పిరిట్' సినిమాను తీయడానికి సిద్ధంగా ఉన్నాడని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ప్రభాస్ స్టంట్స్ విషయంలో కీలక నిర్ణయం
'స్పిరిట్' సినిమా షూటింగ్ షురూ చేసే ముందు ప్రభాస్ తన ప్రస్తుత ప్రాజెక్టులు 'ది రాజా సాబ్', 'ఫౌజీ'లను పూర్తి చేయబోతున్నారు. ఇక ఆ తరువాత రెబల్ స్టార్ పూర్తిగా సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్'పై ఫోకస్ పెట్టబోతున్నారు. ఈ మూవీ కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించినట్టు సమాచారం. అలాగే ప్రభాస్‌ను పోలీస్ పాత్రకు తగ్గ సరికొత్త ఫిజికల్ ట్రాన్స్ఫార్మషన్‌లోకి మారాల్సి ఉంది. అలాగే ఈ మూవీ కోసం వంగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 'స్పిరిట్'లోని చాలా స్టంట్స్‌ను ప్రభాస్ చేత చేయించాలనేది ఆయన ఆలోచన అట. రెబెల్ స్టార్ కూడా ఈ ఛాలెంజ్ స్వీకరించడానికి ఉత్సాహంగా ఉన్నాడని అంటున్నారు. ఇదే గనుక నిజమైతే ప్రభాస్‌ను మోస్ట్ వయోలెంట్ రోల్‌లో చూడాలనే ఆయన అభిమానుల ఆకలి తీరడంతో పాటు, ఆయన సినిమాల్లో స్టంట్స్‌తో పాటు చాలా సీన్స్‌ను డూప్‌తో తీస్తారనే విమర్శలకు ఫుల్ స్టాప్ పడడం ఖాయం.
'స్పిరిట్' సినిమాలోని ఇతర కీలక పాత్రల కోసం అమెరికాతో పాటు కొరియా నుంచి కూడా నటులను ఎంపిక చేయాలని చూస్తున్నాడు వంగా. దీనికి సంబంధించి పలువురు పాపులర్ హాలీవుడ్ స్టార్స్‌తో చర్చలు జరుగుతున్నాయి. రెండు నెలల్లో నటీనటుల ఎంపికపై స్పష్టమైన సమాచారం అందుతుంది. 'స్పిరిట్'ను 2027లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను భూషణ్ కుమార్, సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగాలతో కలిసి నిర్మిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

