By: ABP Desam | Updated at : 23 Jun 2023 04:08 PM (IST)
విమానం(Image Credits: Vimanam/Twitter)
Vimanam : విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన 'విమానం'.. ఇటీవలే థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమా ఓటీటీ అరంగేట్రం దిశగా సాగుతోంది. జూన్ 30వ తేదీ నుంచి జీ 5(ZEE5)లో రిలీజ్ కానున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కొడుకు కలను నిజం చేయాలనుకునే ఓ తండ్రి కథే ఈ 'విమానం' స్టోరీ. తండ్రీ కొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటాయి. విమానం ఎక్కాలన్న కొడుకు కోరికను తీర్చడం కోసం ఒక తండ్రి పడే కష్టాన్ని, తపనను దర్శకుడు తెరపై అద్భుతంగా చూపించారు. వీరిద్దరి మధ్య సాగే కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. కొడుకు కలను నెరవేర్చాలనుకోవడం, వీరయ్య సులభ్ కాంప్లెక్స్ ని కూల్చివేయడంతో అసలు కష్టాలు మొదలవుతాయి.
ఈ కష్టాలు నేచురల్ గా కనిపించకపోవడం, ఎగ్జిబిషన్ లో సన్నివేశాలను సాదాసీదాగా తెరకెక్కించడం ఈ సినిమాకు మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇక కోటి, సుమతి పాత్రల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, విమానాశ్రయంలో వీరయ్య, రాజు పాత్రల మధ్య వచ్చే పతాక సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సినిమాలో అనసూయ, ధనరాజ్, రాహుల్ రామకృష్ణ పాత్రలు కూడా తేలిపోయినట్టు అనిపిస్తాయి. మొత్తంగా చూసినట్టు అయితే ఈ 'విమానం'.. తండ్రీ కొడుకులపై ఓ ఎమోషనల్ రైడ్ గా ఉంటుంది. కాకపోతే ఫుల్ లెంగ్త్ ఎంగేజింగ్ గా ఉండదు. కానీ అక్కడక్కడా డీసెంట్ ఎమోషన్స్ తో ఆకట్టుకుంటుంది. కొంచెం స్లో గా ఉండి ఓ డీసెంట్ ఎమోషనల్ డ్రామాని చూడాలనుకునేవారు ఈ చిత్రాన్నిఇష్టపడతారు.
తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని, నటి అనసూయ భరద్వాజ్, మాస్టర్ ధృవన్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ తదితరులు నటించిన ఈ 'విమానం' సినిమాను.. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించారు. కిరణ్ కొర్రపాటి నిర్మాతగా యానాల శివప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. జూన్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనసూయ.. 'రంగస్థలం', 'పుష్ప' సినిమాల తర్వాత మరోసారి ఈ సినిమాలో విభిన్న పాత్రలో నటించారు. ఆమె మొదటిసారి వేశ్య పాత్రలో నటించారు. ఇక తెలుగు, తమిళ భాషల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుని, ఒక ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్న సముద్రఖని.. ఈ సినిమాలో వికలాంగుడిగా నటించారు.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ.. ఇటీవల హాట్ లుక్స్ తో.. వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తూ వస్తోంది. వరుస సినిమాలతో పలు ప్రాజెక్ట్ లు చేస్తోన్న ఈ 'జబర్దస్త్' భామ.. భిన్న పాత్రల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Urfi Javed Instagram Account: బిగ్ బాస్ బ్యూటీకి ఇన్ స్టా షాక్, అకౌంట్ ను సస్పెండ్, కానీ..
Animal Day 2 Collections: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న ‘యానిమల్‘, రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వసూళు చేసిందంటే?
Shalini Pandey: తెలుగు సినిమాల కోసం ఎదురుచూపు - మనసులో మాట చెప్పేసిన అర్జున్ రెడ్డి బ్యూటీ
Salaar Trailer : యూట్యూబ్లో దుమ్ములేపిన 'సలార్' ట్రైలర్ - 'KGF2' తో పాటూ అన్ని రికార్డులు బద్దలు!
Daggubati Abhiram Wedding : దగ్గుబాటి వారి ఇంట పెళ్లి సందడి - శ్రీలంకలో రానా తమ్ముడి వివాహ వేడుకలు, పెళ్లి ఎప్పుడంటే?
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Telangana Results KCR : కాంగ్రెస్పై అభిమానం కన్నా కేసీఆర్పై కోపమే ఎక్కువ - తెలంగాణ ప్రజలు ఇచ్చిన సందేశం ఇదేనా ?
Winning Minister 2023: మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి విజయం- ఆయనతోపాటు గెలిచిన మంత్రులు వీళ్లే
Telangana constituency wise results: తెలంగాణ తీర్పు: ఏయే నియోజకవర్గంలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
/body>