Subham Movie: స్పెషల్ అట్రాక్షన్‌గా సమంత - 'శుభం' మూవీ 'జన్మ జన్మల బంధం' సాంగ్ చూశారా..
Subham Movie Song: సమంత నిర్మించిన 'శుభం' మూవీ నుంచి కొత్త సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇందులో సమంత స్టెప్పులతో అదరగొట్టారు. ఈ నెల 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Samantha's Subham Movie Janma Janmala Bandham Song Unveiled: స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నిర్మించిన 'శుభం' (Subham) మూవీ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ మూవీ నుంచి 'జన్మ జన్మల బంధం' ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యింది.
స్పెషల్ అట్రాక్షన్‌గా సమంత
కామెడీ, హారర్ ప్రధానాంశంగా తెరకెక్కిన మూవీలో డిఫరెంట్ రోల్‌లో నటిస్తున్నారు. 'జన్మ జన్మల బంధం' సాంగ్‌లోనూ రెట్రో పాప్ స్టైల్‌లో ఇతర యాక్టర్స్‌తో పాటు సమంత అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ పాటను బినాకా గోమ్స్, జైన్ బాక్స్ వాలా ఆలపించగా.. షోర్ పోలీస్ మ్యూజిక్ అందించారు. షోర్ పోలీస్, జైన్ బాక్సావాలా, అభిరామ్ మహంకాళి లిరిక్స్ అందించారు.
ఈ సినిమాకు 'సినిమా బండి' ఫేం ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించగా.. హర్షిత్ రెడ్డి, సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీకి వసంత్ మరిగంటి స్టోరీ అందించారు. సమంత సైతం డిఫరెంట్ రోల్‌లో దెయ్యాలను వదిలించే మాతగా కనిపించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది.
Also Read: ఈ స్నేహం ఎలాంటి షరతులు లేకుండా కంటిన్యూ అవుతుంది - కవితపై నందమూరి అలేఖ్య ఎమోషనల్ పోస్ట్
You’re going to do this so much better than we did. Show us what you’ve got
— Samantha (@Samanthaprabhu2) May 3, 2025
💃💃💃
Full song out now: https://t.co/v0UrllMPYg #Subham #SubhamOnMay9 pic.twitter.com/9794ZwLBbq
స్టోరీ అదేనా?
సీరియళ్లకు అడిక్ట్ అయ్యే భార్యలు.. వాటి వల్ల ఇబ్బందులు పడే భర్తలు.. ఇదే ప్రధానాంశంగా కామెడీ హారర్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. భార్యలను కంట్రోల్ చేయడం ఎలా? అనే టాపిక్‌పై ముగ్గురు స్నేహితుల చర్చతో ట్రైలర్ ప్రారంభం కాగా.. అప్పటివరకూ తనతో సరదాగా మాట్లాడిన భార్య.. 9 కాగానే టీవీలో మొదలైన సీరియల్ చూసి సైకోలా మారిపోవడం ఆసక్తిని పెంచింది. టీవీ ఆపడానికి యత్నించిన భర్తలను భార్యలు బెదిరిస్తుంటారు.
సిటీలో భార్యలు సీరియళ్లు చూస్తూ దెయ్యాలుగా ప్రవర్తిస్తుండడంతో భర్తలు ఆందోళన చెందుతుంటారు. అసలు భార్యలు అలా ఎందుకు మారుతున్నారు?, భార్యల ప్రవర్తనతో భర్తలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? వంటివి తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
సమంత (Samantha) 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి.. ఫస్ట్ మూవీ 'శుభం'ను నిర్మించారు. ప్రస్తుతం సమంత చేతిలో 'రక్త్ బ్రహ్మాండ్ : ది బ్లడీ కింగ్డమ్', 'మా ఇంటి బంగారం' వంటి సినిమాలు ఉన్నాయి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'సిటాడెల్: హనీ బన్నీ' (Citadel Honey Bunny) వెబ్ సిరీస్ సీజన్ 2ను 'అమెజాన్ ప్రైమ్ వీడియో' క్యాన్సిల్ చేసింది. నటిగా సక్సెస్ అయిన ఆమె నిర్మాతగానూ సక్సెస్ కావాలని ఆమె ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.





















