Nandamuri Alekhya: ఈ స్నేహం ఎలాంటి షరతులు లేకుండా కంటిన్యూ అవుతుంది - కవితపై నందమూరి అలేఖ్య ఎమోషనల్ పోస్ట్
Kalvakuntla Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీతో కవితతో తన 20 ఏళ్ల ఫ్రెండ్ షిప్ గుర్తు చేసుకుంటూ నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇది వైరల్‌గా మారింది.

Nandamuri Alekhya Emotional Post About 20 Years Of Friendship With Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో (Kavitha) తన 20 ఏళ్ల ఫ్రెండ్ షిప్ గుర్తు చేసుకుంటూ నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య (Nandamuri Alekhya) తాజాగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ ఫ్రెండ్ షిప్ మరింత పదిలమైందే తప్ప ఏనాడూ బలహీనపడలేదని అన్నారు.
అలేఖ్య ఏం చెప్పారంటే..
తమ 20 ఏళ్ల ఫ్రెండ్ షిప్ గుర్తు చేసుకుంటూ అలేఖ్య ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. 'కష్టాలను ఎదిరించాం. తుపాన్లు ఎదుర్కొన్నాం. అసాధ్యమైన వాటిని ఫేస్ చేశాం. ప్రతీ సవాల్‌తో బలంగా లేచాం. ఏనాడు మన స్నేహం చెక్కు చెదరలేదు. మేం ప్రతీ రోజూ మాట్లాడకపోవచ్చు. కానీ ఎలాంటి షరతులు, ప్రశ్నలు లేకుండా ఈ స్నేహం ఇలాగే కొనసాగుతుంది. కవిత అంటే నాకు ఎంతో అభిమానం. ఈ బంధం ఇలాగే బలపడుతుంది. అందంగా పెరుగుతుంది.' అంటూ ఇన్ స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు.
View this post on Instagram
నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
ఈ సందర్భంగా కవితతో దిగిన ఓ ఫోటోను షేర్ చేయగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు వీరి ఫ్రెండ్ షిప్‌ను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తుండగా.. వీరి స్నేహం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు. మరికొందరు మాత్రం అలేఖ్య బీఆర్ఎస్ పార్టీకి దగ్గరయ్యేందుకే ఇలా పోస్ట్ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఓటీటీతో పాటే టీవీలోకి నితిన్ 'రాబిన్ హుడ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
2023లో నందమూరి తారకరత్న మరణం తర్వాత అలేఖ్య తన పిల్లల బాధ్యతలను చూసుకుంటున్నారు. గతంలో ఆమె మూవీ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. తారకరత్న, అలేఖ్య దంపతులకు ముగ్గురు పిల్లలు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అలేఖ్య.. తారకరత్న జ్ఞాపకాలను పంచుకుంటుంటారు.






















