Panchayat Web Series Season 4 OTT Release Date: హిట్ సిరీస్ 'పంచాయత్ సీజన్ 4' స్ట్రీమింగ్‌కు రెడీ - టీజర్ చూశారా?
Panchayat Web Series Teaser: సూపర్ హిట్ కామెడీ డ్రామా సిరీస్ 'పంచాయత్' నాలుగో సీజన్ జులై 2 నుంచి 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా టీజర్‌ను రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.

Panchayat Web Series Season 4 Teaser Unvieled: సూపర్ హిట్ విలేజ్ కామెడీ వెబ్ సిరీస్ 'పంచాయత్' సీజన్ 4 (Panchayat Season 4) త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. ఇప్పటికే 3 సీజన్స్ పూర్తి చేసుకోగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ కానుండగా.. తాజాగా నాలుగో సీజన్ టీజర్‌ను రిలీజ్ చేశారు.
విలేజ్ ఎలక్షన్స్ కథాంశంగా..
సిటీలో పుట్టి పెరిగిన ఓ యువకుడు అభిషేక్ త్రిపాఠీ ఉద్యోగావకాశాలు లేక విలేజ్‌లో పంచాయతీ సెక్రటరీ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అక్కడ అతనికి ఎదురైన అనుభవాలు, ఇబ్బందులను కామెడీ జానర్‌లో గత 3 సీజన్లలో చూపించారు. ఇప్పుడు కొత్త సీజన్ పంచాయతీ ఎన్నికలే ప్రధానాంశంగా సాగనున్నట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. గత సీజన్లలానే ఈ సిరీస్‌లోనూ ఫుల్ కామెడీ ఉండనుందని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, చందన్ రాయ్, సాన్వికా, ఫైసల్ మాలిక్, దుర్గేష్ కుమార్, సునీతా రాజ్వార్, పంకజ్ ఝూ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ విజయవర్గీయ దర్శకత్వం వహించారు.
Phulera mein elections ki garma garmi shuru hone wali hai 👀🗳️#PanchayatOnPrime, New Season, July 2 pic.twitter.com/bsVMojSUEk
— prime video IN (@PrimeVideoIN) May 3, 2025
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
సరికొత్త కామెడీ డ్రామా సిరీస్‌గా వస్తోన్న ఈ సిరీస్ నాలుగో సీజన్ జులై 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఫస్ట్ సీజన్ 2020లో ఫస్ట్ సీజన్.. సెకండ్ సీజన్ 2022లో.. మూడో సీజన్ 2024లో రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇదే జోష్‌తో నాలుగో సీజన్ సైతం వస్తోంది.
Also Read: ఓటీటీతో పాటే టీవీలోకి నితిన్ 'రాబిన్ హుడ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
తెలుగు 'సివరపల్లి'.. స్టోరీ ఏంటంటే?
'పంచాయత్' సీజన్ హిట్ కాగా.. తెలుగులో ఈ సిరీస్‌ను 'సివరపల్లి'గా (Sivarapalli) రీమేక్ చేశారు. ఇందులో రాగ్ మయూర్, రూపలక్ష్మి (Roopa Lakshmi), మురళీధర్ గౌడ్ (Muralidhar Goud) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు దర్శకుడు భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించగా.. తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక స్టోరీ విషయానికొస్తే.. ఫారిన్ వెళ్లి సెటిల్ కావాలనుకునే ఓ యువకునికి ఓ గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా ఉద్యోగం వస్తుంది. అయితే, తన ప్రెండ్స్ సలహా మేరకు ఉద్యోగం చేస్తూనే ఫారిన్ వెళ్లేందుకు ఎంట్రెన్స్ టెస్ట్ రాసేందుకు ప్రిపేర్ అవుతుంటాడు.
అయితే, ఆ ఊరి సర్పంచ్, అతని అసిస్టెంట్ చేసే పనులు అతనికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంటాయి. అంతే కాకుండా గ్రామీణ వాతావరణంలో ఇబ్బందులు పడుతుంటాడు. అన్నింటినీ అధిగమించి ఆ పరీక్ష రాస్తాడు. అయితే, అందులో అనుకున్నంత స్కోర్ రాకపోవడంతో నిరాశ చెందుతాడు. ఇదే టైంలో తన కూతురుని అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని సర్పంచ్ భావిస్తాడు. అసలు పల్లెటూరి లైఫ్ స్టైల్ ఇష్టం లేని అతను ఎంత త్వరగా వీలైతే అక్కడి నుంచి అంత త్వరగా వెళ్లిపోవాలని అనుకుంటాడు. దీనికి అతను ఏం చేస్తాడు.? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సింది. ఈ సిరీస్ 'అమెజాన్ ప్రైమ్'లో అందుబాటులో ఉంది.





















