Anaganaga OTT Release Date: నేరుగా 'ఈటీవీ విన్'లోకి సుమంత్ 'అనగనగా' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
Anaganaga OTT Platform: యంగ్ హీరో సుమంత్ నటించిన లేటెస్ట్ మూవీ అనగనగా. ఈ మూవీ నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కానుండగా.. తాజాగా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది మూవీ టీం.

Sumanth's Anaganaga OTT Release On ETV Win: యంగ్ హీరో సుమంత్ (Sumanth) లేటెస్ట్ మూవీ 'అనగనగా' నేరుగా ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌లో (ETV Win) స్ట్రీమింగ్ కానుంది. ఈ ఉగాదికే సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. తాజాగా స్ట్రీమింగ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే..
ఈ నెల 15 నుంచి 'అనగనగా' (Anaganaga) సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని 'ఈటీవీ విన్' సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. 'వ్యాస్ సార్ ప్రపంచం మే 15న రాబోతోంది. మీ క్యాలెండర్లను మార్క్ చేసుకోండి!. 'అనగనగా' మీ హృదయాలను దోచుకోవడానికి వస్తోంది. మీ సొంత స్టోరీని గుర్తు చేసే కథకు కౌంట్‌డౌన్ ప్రారంభించండి.' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.
Vyas’ world unfolds on May 15 – only on @etvwin!
— Sumanth (@iSumanth) May 3, 2025
Mark your calendars!
"#Anaganaga" – A Win Original Film. A story from the heart, for the heart.@rakeshreddy1224 @pavan_pappula @arvindmule_pd @ashwinrajasheka @Sri_Avasarala @chvenkatesh78@krishient @Asunnysanjay… pic.twitter.com/OZ8Upv7y6l
Also Read: సైంధవ్ విషయంలో తప్పు నాదే - వెంకీతో మరో సినిమా తీసి హిట్ కొడతానన్న శైలేష్
స్నేహం.. ప్రేమ.. ఓ చిరు జ్ఞాపకం
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఓ వీడియో ఆకట్టుకుంటోంది. సుమంత్ ఓ బుక్ చదువుతుండగా.. అతని కొడుకు 'క్యాట్స్‌కు ర్యాట్స్ అంటే ఎందుకు కోపం?' అని ప్రశ్నిస్తాడు. ఇలా రకరకాల ప్రశ్నలతో విసిగిస్తుంటే.. సుమంత్ చదువుకోమని అంటాడు. దీంతో బుక్ విసుగ్గా మూసేసిన సుమంత్ కొడుకు.. 'ప్రతీ కథ అనగనగా అంటూ ఎందుకు మొదలవుతుంది?' అని ప్రశ్నిస్తాడు. ఎందుకంటే.. 'ఓ మంచి కథ స్నేహం, ప్రేమ, ఓ చిన్న జ్ఞాపకాన్ని గుర్తు చేస్తాయి.' అందుకే అంటాడు సుమంత్. అయితే.. మన కథ కూడా చెప్పొచ్చు కదా.. అంటూ కొడుకు అడగ్గా.. వ్యాస్ సార్.. చెప్పడం స్టార్ట్ చేస్తారు.
ఈ మూవీకి సన్నీకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. సుమంత్ సరసన కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'ఈటీవి విన్'తో కలిసి కృషి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అవసరాల శ్రీనివాస్, మాస్టర్ విహార్ష్, అనుహసన్, రాకేష్ రాచకొండ, బీవీఎస్ రవి, కౌముది నేమాని కీలక పాత్రలు పోషించారు. సుమంత్ స్కూల్ టీచర్‌గా అలరించబోతున్నారు. స్కూల్ బ్యాక్ డ్రాప్‌లో ప్రస్తుతం విద్యా వ్యవస్థ, పిల్లలకు ఎలా చెబితే చదువు అర్థం అవుతుందో అనేదే ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడు సన్నీ ఈ మూవీతోనే డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతుండగా.. హీరోయిన్ కాజల్ చౌదరి సైతం ఇదే మూవీతో ఎంట్రీ ఇస్తున్నారు.
ఈ మూవీతో సుమంత్ కమ్ బ్యాక్ కావాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం మహేంద్రగిరి వారాహి పేరుతో ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తుండగా.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు.





















