Sailesh Kolanu: సైంధవ్ విషయంలో తప్పు నాదే - వెంకీతో మరో సినిమా తీసి హిట్ కొడతానన్న శైలేష్
Venkatesh: హిట్ 3 సక్సెస్ జోష్‌లో ఉన్న డైరెక్టర్ శైలేష్ కొలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెంకటేష్ 'సైంధవ్' ఫెయిల్యూర్‌పై కామెంట్స్ చేశారు. ఆ మూవీ రిజల్ట్ విషయంలో మొత్తం రెస్పాన్సిబిలిటీ తనదేనన్నారు.

Sailesh Kolanu Clarifies About Movie With Venkatesh: నేచురల్ స్టార్ నాని (Nani) 'హిట్ 3' మూవీ సక్సెస్ జోష్‌లో ఉన్నారు డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu). 'హిట్' ఫ్రాంఛైజీ జోష్ కొనసాగిస్తూనే.. ఆయన తన తర్వాత ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విక్టరీ వెంకటేష్‌తో మూవీ గురించి అప్ డేట్ ఇచ్చారు.
వెంకీతో కచ్చితంగా హిట్ కొడతా..
తాను విక్టరీ వెంకటేష్‌తో (Venkatesh) మరో సినిమా చేసి హిట్ కొడతానని అన్నారు శైలేష్. అది కామెడీ జానర్ వేరే ఏదైనా జానర్ అనేది చెప్పలేనని.. కచ్చితంగా వెంకీతో మరో సినిమా చేస్తానని స్పష్టం చేశారు. 'సైంధవ్ విషయంలో నాదే మిస్టేక్. ఆ సినిమా విషయంలో వేరే ఎక్కడా నేను తప్పు చెప్పాలని అనుకోవడం లేదు. ఈ సినిమా విషయంలో అందరూ నాకు సపోర్ట్ చేశారు. ఈ సినిమా రిజల్ట్ విషయంలో మొత్తం బాధ్యత నాదే. ఆ మూవీకి సంబంధించి రైటింగ్, చాలా విషయాల్లో ఇంకా బెటర్‌గా పని చేయాల్సింది.
రిలీజ్ డేట్, సంక్రాంతి టైంలో మూవీ రిలీజ్ ఇలా ఎన్ని కారణాలు చెప్పినా అవన్నీ నా రెస్పాన్సిబిలిటీ. నేనే కరెక్ట్ చేయాల్సిన విషయాలు. రైటింగ్ విషయంలోనే చాలా తప్పులు జరిగాయి. ఇంకా బెటర్‌గా రాసుంటే బాగుండేది అని అనుకున్నా. ఆ బాధ్యత, జాగ్రత్తతోనే హిట్ 3 విషయంలో చాలా కేర్ తీసుకున్నా. ఇదే ఎక్స్ ట్రా కేర్‌తో మరో సినిమా చేసి వెంకీ సార్‌తో పెద్ద హిట్ కొట్టాలని అనుకుంటున్నా.' అని శైలేష్ చెప్పారు.
Also Read: విజయ్ దేవరకొండతో మరోసారి రష్మిక - ఆ పోస్ట్‌తో కన్ఫర్మ్ చేసేసినట్లేనా?
ఇప్పటివరకూ యాక్షన్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ డ్రామాలే తీసిన శైలేష్ ఇప్పుడు డిఫరెంట్‌గా రొమాంటిక్ కామెడీ జానర్‌లో ఓ మూవీ తీయాలని అనుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం' కామెడీ ఎంటర్‌టైనర్‌తో హిట్ కొట్టారు వెంకటేష్. ఈ క్రమంలో వెంకీ కోసం ఆయన కామెడీ జానర్‌లోనే ఓ కథ రాసుకుంటారని తెలుస్తోంది. ఇటీవల తాను కింగ్ నాగార్జునతో ఓ మూవీ చేయబోతున్నారనే వార్తలు హల్చల్ చేస్తుండగా దానిపైనా క్లారిటీ ఇచ్చారు. నాగ్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఇప్పటివరకూ ఆయన్ను కలవలేదని అన్నారు.
సక్సెస్ జోష్‌లో ఉండగానే..
సైకో కిల్లర్స్, బ్రూటల్ మర్డర్స్, వాటిని ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఆఫీసర్స్, సస్పెన్స్, ఊహించని ట్విస్టులతో సాగే సీన్స్ వీటినే ప్రధానాంశాలుగా మూవీస్ తెరకెక్కించారు శైలేష్. ఈ క్రమంలోని 'హిట్'తో తన డైరెక్షన్ జర్నీ స్టార్ట్ చేశారు. హిట్ 1, హిట్ 2 మంచి సక్సెస్ అందుకున్నాయి. ఆ తర్వాత వెంకటేష్‌తో మాస్ యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్ తెరకెక్కించారు. 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేకపోయింది. తాజాగా 'హిట్ 3'తో మళ్లీ హిట్ కొట్టారు శైలేష్. ఇదే జోష్ కొనసాగించాలని.. హిట్ ఫ్రాంచైజీతో పాటు మరిన్ని మంచి సినిమాలు అందించాలని మూవీ లవర్స్ ఆకాంక్షిస్తున్నారు.





















