By: ABP Desam | Updated at : 02 Jan 2023 11:36 AM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Samanthaprabhu2/twitter
సౌత్ టాప్ హీరోయిన్ సమంతా గత కొంత కాలంగా మయోసైటిస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతోంది. సమంతా సోషల్ మీడియా ద్వారా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘యశోద’ సినిమా కంటే ముందు నుంచే తను ఈ సమస్యతో బాధపడుతుండగా, ఆ తర్వాత పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు సైతం వినిపించాయి. ఇటీవల తన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. వాటన్నింటిని సమంత కుటుంబ సభ్యులు, సన్నిహితులు కొట్టిపారేశారు. ప్రస్తుతం సమంతా కోలుకుంటుందని వెల్లడించారు. త్వరలోనే సినిమాలు చేస్తుందని చెప్పారు. అనారోగ్యం కారణంగా కొన్ని సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు వచ్చిన వార్తలను సైతం ఖండించారు. అయితే, తాజా సమాచారంతో మరోసారి సమంత ఆరోగ్యంపై వార్తలు వస్తున్నాయి.
కానీ, ప్రస్తుతం సమంతా బాలీవుడ్ కు సంబంధించిన పెద్ద ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది కాలంగా విశ్రాంతి తీసుకుంటున్న సమంతా, ఇప్పటికీ తన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో కొన్ని సినిమాల నుంచి తప్పుకోవాలని భావిస్తోందట. ఈ నేపథ్యంలోనే ఓ వార్త వైరల్ అవుతోంది. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ తర్వాత బాలీవుడ్ లో మరో యాక్షన్ వెబ్ సీరిస్‌కు సమంతా ఓకే చెప్పింది. ‘ఫ్యామిలీ మ్యాన్’ దర్శకులు రాజ్, డీకే దర్శకత్వంలోనే స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ తెరకెక్కుతోంది. ఈ సిరీస్ లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్పై ఏజెంట్స్ గా సమంత, వరుణ్ కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సిరీస్ తోనే వరుణ్ ఓటీటీలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సిరీస్ అంతా 1990 బ్యాక్ డ్రాప్ లో సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, అనారోగ్య కారణాల వల్ల సమంత ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
వాస్తవానికి అనారోగ్య సమస్యల కారణంగా సమంతా కొన్ని ప్రాజెక్టుల నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఊహాగానాలు వాస్తవం అనేలా బాలీవుడ్ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. మరికొంత కాలం సమంతా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రస్తుతం సమంతా మయోసైటిస్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లంది. అక్కడ చికిత్స తీసుకుంది. ఇండియాకు తిరిగి వచ్చి ఇక్కడ కూడా చికిత్స కంటిన్యూ చేస్తోంది. అటు కేరళ ఆయుర్వేది వైద్యం కూడా తీసుకుంటోంది. మరోవైపు ఇంకా మెరుగైన చికిత్స కోసం సౌత్ కొరియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, పూర్తిగా వ్యాధి నుంచి నయం కావడానిఆకి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పడంతో సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని భావిస్తోందట. విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ‘కుషి’ మూవీ తర్వాత కొంతకాలం సినిమాలకు పూర్తి బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మయోసైటిస్ సమస్యతో బాధపడే వారు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలట. దీంతో ఆమె పలు సినిమాల నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. సమంత చివరిసారిగా ‘యశోద’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత దేవ్ మోహన్ తో ‘శాకుంతలం’ సినిమాలో చేస్తోంది. అటు విజయ్ దేవరకొండతో ‘కుషి’లో నటిస్తోంది. బాలీవుడ్ లోనూ పలు ప్రాజెక్టులు చేస్తోంది.
Read Also: పెద్ద మనసు చాటుకున్న మహేష్ బాబు కూతురు, తండ్రి ఫౌండేషన్ కు పాకెట్ మనీ విరాళం
K Viswanath Death: కె.విశ్వనాథ్ కెరీర్లో ఆ మూవీ ఓ మైలురాయి - కానీ, అది మానసికంగా చాలా బాధించిందట!
Sankarabharanam: తెలుగు సినిమాకు ఊపిరి పోసిన ‘శంకరాభరణం’ రిలీజైన రోజే అస్తమించిన కళాతపస్వి!
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు
K Viswanath Death: టాలీవుడ్ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం
KCR Political strategy : గవర్నర్తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!