By: ABP Desam | Updated at : 02 Jan 2023 10:19 AM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@urstrulymahesh/twitter
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో టాప్ హీరోగా కొనసాగడమే కాదు, సేవా గుణంలోనూ మంచి మనసు చాటుకుంటున్నారు. తన పేరిట ఓ ఫౌండేషన్ ను స్థాపించి ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. పలువురు చిన్నారులకు, పేద ప్రజలకు గుండె ఆపరేషన్లు సహా, వైద్యసాయం చేస్తున్నారు. ఆయన దాతృత్వంతో ఎంతో మంది చిన్నారులు గుండె జబ్బులను నయం చేసుకున్నారు. తాజాగా మహేష్ ఫౌండేషన్ కు సంబంధించిన వెబ్ సైట్ ప్రారంభం అయ్యింది.
ఈ విషయాన్ని మహేష్ బాబు ముద్దుల కూతురు సితార వెల్లడించింది. తండ్రితో పాటు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఈ చిన్నారి, వెబ్ సైట్ వివరాలను వివరించింది. స్విట్జర్లాండ్‌లో మహేష్ ఫ్యామిలీ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నారు. ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. నూతన సంవత్సం సందర్భంగా సితార మహేష్ వెబ్ సైట్ లాంచింగ్ గురించి చెప్పింది. మహేష్ ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించింది. తన తండ్రి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించబోతున్నట్లు సితార తెలిపింది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. ఈ ఫౌండేషన్ కోసం తన వంతు సాయంగా పాకెట్ మనీని విరాళంగా ఇస్తున్నట్లు చెప్పింది. అందరూ ఈ ఫౌండేషన్ కు విరాళాలు అందించాలని కోరింది. ఈ డబ్బు ద్వారా ఎంతో మంది పేదలకు సూవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పింది. “నూతన సంవత్సరంలో మహేష్ ఫౌండేషన్ అధికారిక వెబ్‌సైట్ http://maheshbabufoundation.org ప్రారంభించడం పట్ల ఎంతో సంతోషిస్తున్నాం” అని సితార చెప్పింది. ఫౌండేషన్ తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.
In our endeavour to create a world where children survive and thrive, we are happy to be launching our official website this New Year! https://t.co/jY6B4gXMPd
For the children...to the children ❤️#MBFoundation wishes you all a happy new year 2023!@urstrulymahesh pic.twitter.com/MdOhnee1sr— Mahesh Babu Foundation (@MBfoundationorg) January 1, 2023
ఇక ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీ స్విట్జర్లాండ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. సితార, గౌతమ్, నమ్రతతో కలిసి మహేష్ హ్యాపీగా జాలీగా గడుపుతున్నారు. త్వరలో ఇండియాకు తిరిగి రానున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి మహేష్ ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. న్యూ ఇయర్ కావడంతో షూటింగ్ కు కాస్త విరామం ప్రకటించారు.
Read Also: తునీషా శర్మ సూసైడ్ టు రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్, 2022లో టాప్ 10 కాంట్రవర్సీలు ఇవే!
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
సిద్దార్థ్- కియారా జంటకు క్షమాణలు చెప్పిన ఉపాసన, ఎందుకంటే..
Ennenno Janmalabandham February 8th: బయటపడిన అభిమన్యు అసలు రంగు, మాళవిక బతుకు బస్టాండ్- మనసులతో ఊసులాడుకున్న వేద, యష్
Pawan Kalyan As God : ప్రేమికుల రోజు నుంచి దేవుడిగా పవన్ కళ్యాణ్
Guppedanta Manasu February 8th: మహేంద్రనా మజాకా! టామ్ అండ్ జెర్రీ కొత్త ప్రయాణం మొదలైంది
ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్
Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్