Samantha And Nayanathara: ఫెమీనా ఫ్యాబులస్ 40 లో చోటు దక్కించుకున్న సామ్, నయన్..
వివిధ రంగాల్లో రాణించి, స్పూర్తిగా నిలిచే మహిళలను ప్రతి ఏడాది ఫెమీనా ఎంపిక చేసి ఫ్యాబులస్ 40 గా గుర్తిస్తుంది.
దేశానికి పేరు తెచ్చే క్రీడాకారిణులు, సినిమా రంగంలో రాణించిన తారా మణులు, వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న వ్యాపారవేత్తలు... ఇలా స్త్రీ లోకానికి స్పూర్తి నింపేలా విజయాలను సాధించిన నారీ మణులకు అందిం నీరాజనమే ఫ్యాబులస్ 40. అలాంటి వారిని 40 మందిని ఎంపిక చేసి వారిని ‘ఫ్యాబులస్ 40’గా ప్రకటిస్తుంది ఫెమీనా. ఈసారి ఆ జాబితాలో తెలుగు వారికి ఎంతో ఇష్టమైన హీరోయిన్లు నయన తార, సమంత కూడా నిలిచారు. వీరితో పాటూ బాలీవుడ్ కథానాయికలు ప్రియాంక చోప్రా, అలియా భట్, భూమి పెడ్నేకర్ కు కూడా చోటు దక్కింది. టోక్యో పారాలింపింక్స్ లో టేబుల్ టెన్నిస్ లో సిల్వర్ మెడల్ సాధించిన భవాని పటేల్ కూడా ఫ్యాబులస్ 40 జాబితాలో చేరింది.
సమంత తనను ఎంపిక చేసినందుకు ఫెమీనా వారికి ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు చెప్పింది. ‘నిజంగా ఇది నాకు ఎంతో గౌరవం, థ్యాంక్యూ’ అని ట్వీట్ చేసింది. ఫెమీనా ఇండియా సంస్థ అంతకుముందే సమంతా ఫోటోతో పాటూ ఆమె ఇప్పటి వరకు 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 2 నంది అవార్డులు, 4 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డులు, 3 సినీ మా అవార్డులు గెలుచుకుందని ట్వీట్ లో పేర్కొన్నారు. విడాకుల వివాదంలో చిక్కుకుని అల్లాడుతున్న సమంతకు ఈ గుర్తింపు కాస్త ఊరటనిచ్చేదే.
నయన్ కూడా...
నయనతార గురించి చెబుతూ ఫెమీనా తమ సైట్లో ‘తమిళ సూపర్ స్టార్’ అని సంబోధించింది. 2003లో టెలివిజన్ యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి, ఇప్పుడు తిరుగులేని హీరోయిన్ గా ఎదిగిందని ప్రశంసించింది.
Truly an honour 🙏Thankyou 🥰 https://t.co/0PgwCFZWZP
— S (@Samanthaprabhu2) September 26, 2021
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also read: రోజుకో గ్లాసుడు రాగి జావ తాగండి.. వైద్యుడి వద్దకు వెళ్లే అవసరం తగ్గుతుంది
Also read: మీకోసం బెస్ట్ ఫుడ్ ప్లాన్.. సూచిస్తున్నది ఓ బాలీవుడ్ సెలెబ్రిటీ న్యూట్రిషనిస్టు
Also read: చర్మం మెరిసేందుకు విటమిన్ ఎ కావాల్సిందే... మీ ఆహారంలో విటమిన్ ఎ ఉందా?
Also read: సాహో బ్యూటీ శ్రద్ధా ఆటోలో షికార్లు... నెటిజన్ల ప్రశంసలు
Also read: ‘రైమ్’ ను ముద్దులతో ముంచెత్తుతున్న రామ్ చరణ్.. క్యూట్ పప్పీతో షికార్లు