Vitamin A Benefits: చర్మం మెరిసేందుకు విటమిన్ ఎ కావాల్సిందే... మీ ఆహారంలో విటమిన్ ఎ ఉందా?
అందం పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషించేది విటమిన్ ఎ. మీరు రోజూ విటమిన్ ఎ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారా?
ప్రపంచంలో రెండు వందల మందికి పైగా విటమిన్ల లోపంతో బాధపడుతున్నారని అంచనా. అందులో విటమిన్ ఎ లోపం వల్ల బాధపడుతున్న వారు ఉన్నారు. నిజానికి విటమిన్ ఎ చాలా సులువుగానే దొరుకుతుంది. అనేక ఆహారపదార్థాల్లో ఇది ఉంటుంది. అయినా విటమిన్ ఎ లోపం వెలుగుచూస్తోందంటే మన ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. విటమిన్ ఏ కాస్త లోపించినా చర్మం కూడా డల్ గా, కాంతిహీనంగా మారుతుంది. అందుకే అందానికి ఆరోగ్యానికి రెండింటికీ విటమిన్ ఎ కావాల్సిందే.
విటమిన్ ఎ వల్ల చర్మానికి కలిగే లాభాలు
1. విటమిన్ ఎ లోపిస్తే చర్మం పొడిగా మారిపోతుంది. విటమిన్ ఎ సరిపడినంత అందితే చర్మం మంచి తేమవంతంగా మారి కాంతులీనుతుంది.
2. త్వరగా ఏజింగ్ లక్షణాలు కనిపించకుండా చేయడంలో ఈ విటమిన్ ముందుంటుంది. చర్మంపై ముడతలు, మచ్చలు, గీతలను నిరోధిస్తుంది.
3. చర్మం బావుండాలండే కొలాజిన్ ఉత్పత్తి చాలా అవసరం. విటమిన్ ఎ, కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది.
4. మొటిమల సమస్యతో బాధపడేవారు , నల్లమచ్చల వల్ల ఇబ్బంది పడే వారికి మంచి పరిష్కారం విటమిన్ ఎ ఉండే ఆహారపదార్థాలు తినడం.
వేటిల్లో విటమిన్ ఎ లభిస్తుంది?
1. మీరు శాకాహారులైతే మీ డైట్ లో బ్రకోలీ, కాలే, పాలకూర, చిలగడ దుంప, క్యారెట్, పాలు, పెరుగు, చీజ్ వంటి వాటిని చేర్చండి.
2. మాంసాహారులైతే గుడ్లు, సాల్మన్ చేప, ఆయిలీ చేపలు, చేపకొవ్వులు వంటివి తింటే మంచిది.
3. ఆహారంవల్ల అందినవి సరిపోవడం లేదు అనిపించినప్పుడు వైద్యులను కలిసి వారి సూచన మేరకు విటమిన్ ఎ క్యాప్సూల్ వాడవచ్చు.
4. డెర్మటాలజిస్టు సలహాతో విటమిన్ ఎ ఉన్న కాస్మోటిక్ ఉత్పత్తులను వినియోగించవచ్చు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also read: సాహో బ్యూటీ శ్రద్ధా ఆటోలో షికార్లు... నెటిజన్ల ప్రశంసలు
Also read: మీకోసం బెస్ట్ ఫుడ్ ప్లాన్.. సూచిస్తున్నది ఓ బాలీవుడ్ సెలెబ్రిటీ న్యూట్రిషనిస్టు
Also read: నాన్నగారు లేరంటే నమ్మలేకపోతున్నా.. త్వరలోనే స్మారక మందిరం పూర్తి చేస్తా -ఎస్పీ చరణ్
Also read: లిక్విడ్ లడ్డూ ఎలా చేయాలంటే.. సెలెబ్రిటీ చెఫ్ సరాంశ్ ఇన్ స్టా పోస్టు వైరల్
Also read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!
Also read: సగ్గు బియ్యంతో బరువు తగ్గే ఛాన్స్.. అదొక్కటే కాదు మరెన్నో ప్రయోజనాలు