Ragi Foods: రోజుకో గ్లాసుడు రాగి జావ తాగండి.. వైద్యుడి వద్దకు వెళ్లే అవసరం తగ్గుతుంది
రోజుకో ఆపిల్ తింటే వైద్యుడు అవసరం లేదంటారు, అలాగే రాగి జావ తాగినా తక్కువగానే అనారోగ్యం బారిన పడతారు.
మనకు ఆరోగ్యాన్నందించే సిరిధాన్యాలలో రాగులదే మొదటిస్థానం. మనదేశంతో పాటూ ఆఫ్రికా, శ్రీలంక, చైనా, మడగాస్కర్, మలేషియా, జపాన్ వంటి దేశాల్లో వీటిని పండిస్తారు. తక్కువ వర్షపాతంతోనే ఈ పంట పండుతుంది. కరువు ప్రాంతాల్లో కూడా దీన్ని పండించుకోవచ్చు. రోజూ రాగి జావ తాగడం అలవాటు చేసుకుంటే చాలా ఆరోగ్యం ప్రయోజనాలు ఉంటాయి. పిల్లలకు కూడా రాగి జావ, రాగి ముద్ద మేలు చేస్తుంది. రాగి జావలో కాస్త పెరుగు, ఉప్పు చేర్చుకుని తింటే చప్పగా అనిపించకుండా, కాస్త రుచిగా అనిపిస్తుంది. రాగులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీరే చదవండి...
1. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకల పటుత్వానికి ఇది పిల్లలకూ, పెద్దలకూ ఇద్దరికీ అవసరం.
2. రాగుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మధుమేహులుకు ఇది మంచి ఎంపిక. ఇది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కనుక ఒకేసారి ఎక్కువ మొత్తంలో రక్తంలోకి గ్లూకోజ్ విడుదలవ్వదు. అంతేకాదు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి.
3. వరిలో దొరికేంత ప్రోటీన్ రాగుల్లో కూడా లభిస్తుంది. శాకాహారులకు ఇవి మంచి ఛాయిస్.
4. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారు రాగులను రోజూ ఆహారంగా స్వీకరించారు. ఆస్టియోపోరాసిస్ వంటి వ్యాధులు ఉన్నవారు, వచ్చే అవకాశం ఉందనే అనుమానం వచ్చినా కూడా రాగుల వంటకాలు తినాలి.
5. యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు ఇందులో అధికం. జ్వరంగా ఉన్నప్పుడు వీటివని జావలా చేసుకుని తాగితే త్వరగా ఆరోగ్యవంతులు కావచ్చు.
6. గుండెకు మేలుచేసే ఆహారాల్లో ఇవి ఒకటి. ఇవి ప్రమాదరకరమైన టైగ్లిసరైడ్స్ ఏర్పడకుండా అడ్డుకుంటాయి. తద్వారా గుండె జబ్బులు రాకుండా రక్షణగా నిలుస్తాయి. రాగులు తరచూ తినేవారికి గుండె పోటు, స్ట్రోక్ వంటివి వచ్చే శాతం తక్కువ.
7. క్యాన్సర్ కారకాలను కూడా శరీరంలో చేరకుండా చూస్తాయి. కణాల నాశనాన్ని అడ్డుకుంటాయి.
8. రాగులతో కేవలం రాగి ముద్ద, రాగి జావే కాదు అనేక రకాల ఆహారపదార్థాలు చేసుకోవచ్చు. రాగి హల్వా, రాగి బిస్కెట్లు, రాగి ఊతప్పం, దోసె, లడ్డూ ఇలా రాగి వంటకాలు ఏవి తిన్నా మంచిదే.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also read: మీకోసం బెస్ట్ ఫుడ్ ప్లాన్.. సూచిస్తున్నది ఓ బాలీవుడ్ సెలెబ్రిటీ న్యూట్రిషనిస్టు
Also read: చర్మం మెరిసేందుకు విటమిన్ ఎ కావాల్సిందే... మీ ఆహారంలో విటమిన్ ఎ ఉందా?
Also read: లిక్విడ్ లడ్డూ ఎలా చేయాలంటే.. సెలెబ్రిటీ చెఫ్ సరాంశ్ ఇన్ స్టా పోస్టు వైరల్